వారణాసి ( కాశి ) యాత్రకు వెళ్లేవారికి ఈ నెంబర్ లు ఉపయోగపడగలవు.
సైకిల్ స్వామి ఆశ్రమం : 9795169495, 0542-2450502
శ్రీరామతారక ఆంధ్రఆశ్రమం :
ఫోన్ : 0542-2450418
email : srtandhrashramam@gmail.com
website : srtaa.org
బాబాజీ ఆశ్రమం :( నారద ఘాట్ )
ఏసీ , నాన్ ఏసీ గదులు, డార్మెటరీ , లాకర్లు కలవు :
9063833844,9491574080,6305665382
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ( నారద ఘాట్ ) : 8333907785,8333907790,8333907791 , 8333907813
తిరుపతి నిత్యాన్నదానం సత్రం (వసతి గృహం ) : 9616549156,08887871043
విశాఖ శ్రీ శారదాపీఠం వారణాసి శాఖ :
0542-2450422,8874944449
S.R.Travels : 8707079836 ( Andhra Travels Raju)
Joshi Travels (T.గజానన్ జోశీ ): 9795712606
పద్మ శాలియుల సత్రం : 7815873766,9849150605
శ్రీ గౌరీ కేదారేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ( జంగన్ వాడి మఠం దగ్గర ) : 7234095555,7379641111
శ్రీరామ తారక ఆంధ్రాశ్రమమం :
110 గదులు కలిగి విశాలమైన వరండాలతో నాలుగువైపుల మొట్లు కలిగి అన్ని సదుపాయాలతో ఉంటుంది. యాత్రికులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. వర్ణభేదాలు లేకుండా హిందువులందరికీ వసతి సౌకర్యం కల్పిస్తారు.
అడ్రస్ : శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం, బి.14-92, మానస సరోవర్, బెంగాలీ టోలా, పాండేహవేలీ, వారణాసి. ఫోన్ : 0542-2450418
భోజన సదుపాయం :
ఆశ్రమంలో దిగిన వారందరికీ పగలు 12 గంటలకు భోజనం రాత్రి 7 గంటల నుండి 8 గంటలలోపు అల్పాహార పాకెట్లు ఉచితంగా ఇస్తారు. ఇందు కోసం ఉదయం 9 గంటలలోపు పేర్లు నమోదు చేయించు కోవాలి. విరాళాలు ఇవ్వవచ్చు. ఇతర వివరాలకు సత్రంలో ఉన్న ఆశ్రమం లోని ఉద్యోగస్తులను సంప్రదించటం మంచిది.
భోలానంద సన్యాస ఆశ్రమం
D.28 -181, పాండేహవేలి, వారణాసి ఫోన్ : 0542-2450416,
సెల్ : 9450707921
అటాచ్డ్ బాత్రూంలతో 10 రూములు, కామన్ బాత్ రూంలతో 8 రూములు కలవు.
శ్రీ శృంగేరి శంకర్ మఠ్
ది శృంగేరి జగద్గురు సంస్థానానికి చెందిన మఠం. కేదార్ ఘాట్ కుఎదురుగా కలదు. కామన్ బాత్రూంలతో 10 ఫర్నిష్ తో ఉన్న గదులు కలవు. రూముకు నలుగురు ఉండవచ్చు. రూములకు అద్దెలుండవు కానీ విరాళాలు స్వీకరిస్తారు. భోజనవసతి లేదు. ముందుగా ఫోన్ చేసి రూములు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
బి 14.111 కేదార్ ఘాట్, వారణాసి
ఫోన్ : 0542-2452768
ట్రావెన్ కోర్ సత్రం
శృంగేరి మఠాన్ని ఆనుకొని ఉంది. కింద ఆరు, పైన ఆరు గదులు కలవు. పాతభవనం, పైన నీటివసతి లేదు. కింద మున్సిపల్ నీరు 8 గంటలు మాత్రమే వస్తుంది.
సత్సంగ శివనామ సంకీర్తనా సదనం
కామన్ బాత్ రూంలతో 9 గదులలో నలుగురు, చిన్నగదులలో ఇద్దరు ఉండవచ్చు. చాపలు, బల్లలు, కుర్చీలు మాత్రమే ఉంటాయి. లాకర్ సౌకర్యం కలదు. బెంగాలీ టోలా గల్లీలోనికి వెళితే వెల్లంపలి రాఘవయ్య, రాఘవమ్మ అన్నసత్రం దగ్గర ఈ సత్రానికి సంబంధించిన బోర్డు తెలుగులో కనబడుతుంది.
మార్కండేయ ఆశ్రమం
కేదార్ ఘాట్ లో, కేదారేశ్వరాలయానికి దగ్గరలో కలదు. ఆటోలు రిక్షాలు ఆశ్రమం దాకా వెళతాయి. 15 రూములు కలవు. నెలవారీగా లేక రోజువారీగా అద్దె ఉంటుంది.
అడ్రస్ : డి7-187 కేదార్ ఘాట్, వారణాసి డి7-187, కేదార ఘాట్
అన్నపూర్ణా ప్రాంతీయ ఆశ్రమం
కేదార్ ఘాట్ లో గుడి దగ్గరలో కలదు. హెడ్ ఆఫీస్, హైదరాబాద్ లో కలదు. అటాచ్డ్ బాత్ రూంల సౌకర్యాలతో రెండు రూములు, కామన్ బాత్ రూం ల సౌకర్యంతో రెండురూములు మాత్రమే కలవు. 15 మంది యాత్రికులు ఒకేసారి బసచేయవచ్చు.
అడ్రస్ : డి 6-112 కేదార్ ఘాట్, సోనార్ పురా, వారణాసి,
ఫోన్ : 0542-5535002.
సెల్ : 9839605344
కాశీ వైశ్వసత్ర సంఘం
ఈ సత్రం కేవలం వైశ్యులకు మాత్రమే. క్షేమేశ్వరఘాట్ కు అతి దగ్గరలో, శ్రీ శృంగేరీ మఠం, కేదార్ఘాట్ పోస్ట్ ఆపీస్ కు ఎదురుగా గలదు. మూడు నుండి అయిదు రోజుల వరకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు పొందవచ్చును. 2 గదులు పర్నిచర్ తో సహా కలవు.
అడ్రస్ : డి14-15 క్షేమేశ్వరఘాట్, కేదార్ ఘాట్ పోస్టాఫీస్ ఎదుట వయా సోనాపురా, వారణాసి.
ఆంధ్ర క్షత్రీయ సంఘం
శ్రీ తారకరామ నిలయం, బి5-281 హనుమాన్ ఘాట్ పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్రోడ్డులో కలదు.
హిందూ యాత్రికులందరికి వసతి కల్పిస్తారు.
గంగా స్నాన ఘట్టాలకు ఒక కిలో మీటరు దూరంలో ఉన్న వసతి గృహాలు
శ్రీ నిర్మలానంద ఆశ్రమం :
బెంగాలి టోలా ఇంటర్ కాలేజి పక్క మదన్ పురా పోస్టాఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డులో కలదు. హిందూ యాత్రికులందరికీ వసతి కల్పస్తారు
ఫోన్ : 0542-2450178,
సెల్ : 98390 36093.
అటాచ్డ్ బాత్ రూంలతో 6, కామన్ టాయ్ లెట్లతో 14 గదులు, 1 హాలు కలవు.
కాశీజంగం మఠ్ :
గోదోలియా చౌరాహ్ నుండి బి.హెచ్. యు వైపు పోతుంటే సుమారు 150-200 మీటర్ల దగ్గరలో ఎడమచేతి పైపు పెద్ద గేటున్న విశాలమైన పురాతన మఠం ఇది. రైల్వే స్టేషన్ నుండి 6-7 కిలో మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డులో కలదు. భారతదేశంలోని హిందువులందరికీ ప్రపవేశం కలదు.
జంగమవాడి మఠ్ :
డి 35-77 వారణాసి.
75 రూములు కలవు.
ఒకేసారి వేయిమందికి సరిపోను వసతి కలదు అద్దెలు లేవు. విరాళాలు స్వీకరిస్తారు. బ్యాంకులు ఎటియం లు దగ్గరలో కలవు.
హరసుందరి ధర్మశాల :
గోధోలియా చౌరాహ నుంచి గిరిజాఘర్ చైరాహాకు వెళ్ళే దారిలో 30 అడుగుల దూరంలో భట్టాచార్య వారి హోమియోపతి మందుల షాపుల కలదు. అందరికీ ప్రవేశం కలదు.
అడ్రస్: హరసుందరి ధర్మశాల, గోదౌలియా, వారణాసి.
ఫోన్ 0542-2452446. 40
రూములు, 6 హాల్స్, అన్నిటికి కామన్ బాత్ రూంలు. సామాన్యులకు అందుబాటులో గల ధర్మశాల.
వీరేశ్వర్ పాండే ధర్మశాల :
గోదౌలియా చౌరాహాకు పడమరగా కొద్ది దూరంలో కనిపించే గిరిజాఘర్ చౌరాహాలో కార్పోరేషన్ బ్యాంక్ కు దగ్గరగా ఉన్న తరుణ్ గుప్తా హాస్పటల్ కు ఎదురుగా లక్సారోడ్ లో కలదు. 22 రూములు, కామన్ బాత్ రూంలు, 8 రూములు అటాచ్డ్ బాత్ రూంలతో కలవు.
అడ్రస్ : 47-200 అస్సి, వారణాసి.
ఫోన్ : 0542-245527.
చౌడేశ్వర్ పాండే ధర్మశాల :
47-200, పి. దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు.
కాశీ ముముక్షు భవన్ సభ :
రైల్వే స్టేషన్ కు 10కి.మీ దూరంలో మెయిన్ రోడ్ మీద కాశీపట్టణానికి దక్షిణం వైపు అసీ ఘాట్ దగ్గర కలదు. 5 ఎకరాల విశాలమైన స్ధలంలో ఉంది. అందరికీ ప్రవేశం కలదు. 150 నుండి 200 మందికి సరిపడు హాలు, 50 గదులు (కొన్నింటికి మాత్రమే అటాచ్డ్ బాత్ రూంలు కలవు)
ఈశ్వర్ మఠం
దండిస్వాములకు 150 రూములు ప్రత్యేకంగా కలవు. కాశీలో చరమదశ గడపాలన్న వారికి 60 రూములు కలవు. రూములకు అద్దెలుండవు. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు స్వీకరిస్తారు. ప్రతి రోజూ బీదలకు అన్నసంతర్పణ జరుగుతుంది. దగ్గరలోనే స్టేట్ బ్యాంక్, బరోడా బ్యాంక్, సెంట్రల్ బ్యాంకులు కలవు. యజ్గ్నయాగాదులు జరుపుకునే సౌకర్యం కలదు.
అడ్రస్ : కాశీ ముముక్షు భవన్ సభ (అన్నక్షేత్ర) గౌడిలియా చౌరాహ్ నుంచి బి హెచ్ యుకు వెళేళ దారిలో తులసీఘాట్ సమీపంలో మెయిన్ రోడ్ లో ముముక్షు భవన్ కు అరకిలోమీటరు దూరంలో కలదు.
శ్రీ మార్వాడి సేవాసంఘ్, భదైనీ (తులసి ఘాట్ దగ్గర) వారణాసి
న్యూ హోటల్ బ్రాడ్ వే :
రైల్వే స్టేషన్ నుండి 8 కి.మీ దూరంలో బి హెచ్ యు వెళ్ళే దారిలో విజయా సినిమా క్రాసింగ్ దగ్గర ఉన్నది. శివాలా ఘాట్ కు అరకిలోమీటర్ దూరంలో ఉంది.
అడ్రస్ : విజయా సినిమా క్రాసింగ్ దగ్గర భేలుపూర్, వారణాసి.
ఫోన్ : 0542-2277097, 3090284
షేర్ ఆనందరామ్ జైపురియా స్మృతిభవన్ సొసైటి (జైపురియా భవన్) :
గదొలియా సెంటర్ నుండి జ్గ్నానవాసికి వెళ్ళే మెయిన్ రోడ్ లో ప్యాలెస్ హోటల్ క్లాక్ టవర్ దాటిన తరువాత మొదటి ఎడమ గల్లీలో ఉన్నది. మొత్తం 35 రూములు కలవు.
ఫోన్ : 0542-2412766, 24127709, 24122674
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్దాశ్రమమం మరియు నిత్యాన్నదాన సత్రం:
ఈ సత్రం ఆర్యవైశ్యులకు మాత్రమే. రెండు సత్రాలు కలవు. మొదటిది అక్నా రోడ్డులో కెనరాబ్యాంక్ ఉన్న సందులో ఉన్నది. 5 అంతస్తుల భవనంలో లిఫ్ట్ తో సహా ఆధునిక సౌకర్యాలు కలవు.
ఫోన్: 0542-2400076, 2455087.
రెండవ సత్రం ఇదేరోడ్ లో రామకృష్ణ మిషన్ హాస్పటల్ దగ్గర
ఫోన్ : 0542-2411829.
*వీరు మూడు రోజుల పాటు ఉచిత వసతి,భోజన సౌకర్యం కల్పిస్తారు.
నోట్ : మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ చేస్తే మేము అప్డేట్ చేయగలము.
Timings of varahi temple
ReplyDelete7am -10am
Deleteదయ చేసి వాట్సాప్ లింక్ కూడా షేర్ లిస్ట్ లో add చేయండి. అందరికీ వీలుగా మరింత ఉపయోగకరంగా వుంటుంది.
ReplyDeleteKasi annapurna vasavi arya vysya vruddashram lo three days free accomidation istaru annaru akkada alanti demi ledu room rent 1600 2500 ala one day ku charge chestunnaru meeru free ga 3 days istaru ani post chesaru meeru correct ga kanukkoni post cheyandi lekapote teliyanivallu velli ibbandi padavalasi vastundi
ReplyDeleteతొగట వీర క్షత్రియులకు సత్రాలు ఏమైనా ఉన్నాయా
ReplyDeleteNepal Muktinath Yatra Call/Whatsapp +91-9198595775
ReplyDelete