శ్యామల నవరాత్రులు 2024 తేదీలు, తిథి సమయం, పూజా విధానం ఏ రోజు ఏ అలంకారం? - 2024 Magha Gupta Navratri (Shyamala Navratri) Dates

శ్యామల నవరాత్రులు 2024 ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18 ముగుస్తాయి.

వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..

ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..

అవి ఏవిటంటే..

1. మాఘమాసంలో  శ్యామలాదేవి నవరాత్రులు.

2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.

3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.

4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.

ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి..చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు,ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికి తెలుసు..కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు..

ఈ గుప్త నవరాత్రులంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరిని పిలిచి చేయరు. చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేసారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి..

ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో గానీ , వ్యాపారంలో గానీ అభివృద్ది కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది..అంతేకాదు ముఖ్యంగా పెళ్లికాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేసారు.

పూర్వం బండాసారుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు  మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది...అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అనికూడా అంటారు. అంతేకాకుండా దశమాహావిద్యలలో మాతంగి అని కూడా పిలుస్తారు.

ఈ 2024వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 26 శుద్ధ పాఢ్యమి శుక్రవారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 9 అమావాస్య శుక్రవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..

ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి 10 శనివారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, ఫిబ్రవరి 18 ఆదివారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.

శ్యామల నవరాత్రి 2024 తేదీలు

మొదటి రోజు "ఫిబ్రవరి 10, శనివారం" నాడు అమ్మవారిని "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-1 పూజ: లఘు శ్యామల (Laghu Shyamala)

తేదీ: 10, ఫిబ్రవరి 2024, శనివారం

తిథి: మాఘ శుక్ల పాడ్యమి

తిథి సమయం: ఫిబ్రవరి, 10 వ తేదీ, 2024 శనివారం, తెల్లవారుఝాము 04 గం,29 ని (am) నుండి

ఫిబ్రవరి, 11 వ తేదీ, 2024 ఆదివారము, రాత్రి 12 గం,47 ని (am) వరకు

రెండవ రోజు  "ఫిబ్రవరి 11, ఆదివారం" నాడు అమ్మవారిని

"వాగ్వాధినీ శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-2 పూజ: వాగ్వాధిని శ్యామల(Vagvadini SyAamala)

తేదీ: 11, ఫిబ్రవరి 2024, ఆదివారం

తిథి: మాఘ శుక్ల విధియా

తిథి సమయం: ఫిబ్రవరి, 11 వ తేదీ, 2024 ఆదివారము, రాత్రి 12 గం,47 ని (am) నుండి

ఫిబ్రవరి, 11 వ తేదీ, 2024 ఆదివారము, రాత్రి 09 గం,09 ని (pm) వరకు

మూడోరోజు "ఫిబ్రవరి 12 , సోమవారం" నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-3 పూజ: నకుల శ్యామల (Nakuli Syamala)

తేదీ 12, ఫిబ్రవరి 2024, సోమవారము

తిథి మాఘ శుక్ల తదియా

తిథి సమయం: ఫిబ్రవరి, 11 వ తేదీ, 2024 ఆదివారము, రాత్రి 09 గం,09 ని (pm) నుండి

ఫిబ్రవరి, 12 వ తేదీ, 2024 సోమవారము, సాయంత్రము 05 గం,44 ని (pm) వరకు

నాల్గవ రోజు "ఫిబ్రవరి 13, మంగళవారం" నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-4 పూజ: హసంతి శ్యామల (Hsanti Syamala)

తేదీ: 13, ఫిబ్రవరి 2024, మంగళవారం

తిథి: మాఘ శుక్ల చవితి

తిథి సమయం: ఫిబ్రవరి, 12 వ తేదీ, 2024 సోమవారము, సాయంత్రము 05 గం,44 ని (pm) నుండి

ఫిబ్రవరి, 13 వ తేదీ, 2024 మంగళవారము, మధ్యహానం 02 గం,42 ని (pm) వరకు

ఐదవ రోజు "ఫిబ్రవరి 14, బుధవారము" నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.

రోజు-5 పూజ: సర్వసిద్ది మాతంగి (Sarvasiddhi Matangi)

తేదీ: 14, ఫిబ్రవరి 2024, బుధవారము

తిథి: మాఘ శుక్ల పంచమి

తిథి సమయం: ఫిబ్రవరి, 13 వ తేదీ, 2024 మంగళవారము, మధ్యహానం 02 గం,42 ని (pm) నుండి

ఫిబ్రవరి, 14 వ తేదీ, 2024 బుధవారము, మధ్యహానం 12 గం,10 ని (pm) వరకు

ఆరవ రోజు "ఫిబ్రవరి 15, గురువారం" నాడు అమ్మవారిని "వాస్యమాతంగి" రూపంలో పూజిస్తారు.

రోజు-6 పూజ: వాస్య మాతంగి (Vasya Matangi)

తేదీ: 15, ఫిబ్రవరి 2024, గురువారం

తిథి: మాఘ శుక్ల షష్ఠి

తిథి సమయం: ఫిబ్రవరి, 15 వ తేదీ, 2024 గురువారం, ఉదయం 10 గం,13 ని (am) వరకు

ఏడవ రోజు "ఫిబ్రవరి 16, శుక్రవారం" నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-7 పూజ: సారిక శ్యామల (Sarika Syamala)

తేదీ: 16, ఫిబ్రవరి 2024, శనివారం

తిథి: మాఘ శుక్ల సప్తమి

తిథి సమయం: ఫిబ్రవరి, 16 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 08 గం,55 ని (am) వరకు

ఎనిమిదవ రోజు "ఫిబ్రవరి 17, శనివారం" నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-8 పూజ: శుక శ్యామల (Suka Syamala)

తేదీ: 17, ఫిబ్రవరి 2024, శనివారం

తిథి: మాఘ శుక్ల అష్టమి

తిథి సమయం: ఫిబ్రవరి, 17 వ తేదీ, 2024 శనివారం, ఉదయం 08 గం,16 ని (am) వరకు

;

తొమ్మిదవ రోజు "ఫిబ్రవరి 18, ఆదివారము" నాడు అమ్మవారిని "రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.

రోజు-9 పూజ: రాజ మాతంగి / రాజ శ్యామల (Raja Syamala)

తేదీ: 18, ఫిబ్రవరి 2024, ఆదివారము

తిథి మాఘ శుక్ల నవమి

తిథి సమయం: ఫిబ్రవరి, 18 వ తేదీ, 2024 ఆదివారము, ఉదయం 08 గం,15 ని (am) వరకు

శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.

ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..

> శ్యామలా నవరాత్రులు పూజా విధానం?

> అత్యంత శక్తివంతమైన శ్రీ శ్యామలా  దేవి దండకం

Tags: శ్యామలా దేవి నవరాత్రులు, శ్యామలా దేవి, Sri Shyamala Devi Navratri, Magha Gupta Navaratri, Shyamala navaratri 2024 dates, Shyamala Navaratrulu dates, Navaratrulu pooja, Dasami, syamala devi dandakam, Shyamala devi pooja telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS