ఫిబ్రవరి 10 నుండి మాఘమాసం ప్రారంభం..మాఘమాసంలో ఈ పనులు చేస్తే.. పుణ్యఫలం మీదే..| Magha Masam Significance

మాఘమాసం ప్రారంభం, మాఘమాస_విశిష్టత

చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది.

కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత...అంత ప్రాధాన్యత!

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

మాఘ_స్నాన_శ్లోకం

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.

ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.

అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.

అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి..శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

మాఘమాసం విశిష్టత

'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత , పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని , వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.

ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని , తటాక స్నానం ద్విగుణం , నదీస్నానం చాతుర్గుణం , మహానదీ స్నానం శతగుణం , గంగాస్నానం సహస్ర గుణం , త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ' ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

మాఘమాసం మహిమ:

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.

శివుడైనా , విష్ణువైనా , ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి , సూర్య తదితర దేవతల పూజలు , వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి , ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది , చెరువు , మడుగు , కొలను , బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

తిథులు:-

1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన , నువ్వులతో హోమం , నువ్వుల దానం , నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం , ఉప్పు దానం చేయటం మంచిది.

2. శుద్ధ విదియ

3. శుద్ధ చవితి

4. శుద్ధ పంచమి

5. శుద్ధ షష్టి

6. శుద్ధ సప్తమి

7. అష్టమి

8. నవమి

9. ఏకాదశి

10. ద్వాదశి

11. త్రయోదశి

12. మాఘ పూర్ణిమ

13. కృష్ణపాడ్యమి

14. కృష్ణ సప్తమి

15. కృష్ణ ఏకాదశి

16. కృష్ణద్వాదశి

17. కృష్ణ చతుర్దశి

18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు , పర్వదినాలు , వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి" అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి , నక్త వ్రతము పూజ చేస్తారు ! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. "కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.

మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన , జప , తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు *"దుఃఖ దారిద్ర్య నాశాయ , శ్రీ విష్ణోతోషణాయచ ! ప్రాతఃస్నానం కరోమ్య , మాఘ పాప వినాశనం!"* అని చేసిన తరువాత *"సవిత్రేప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం , పాపం యాతు సస్రదా !"* అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.

ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నవ్వులను , పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట.

అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి.

> మాఘ స్నానం విశిష్టత? మాఘస్నానం ఎవరు చేయాలి ? ఎలా చేయాలి ?

> మాఘ మాసం విశిష్టత - ఈ మాసంలో ఏ పనులు చేయాలి?

Tags: మాఘమాసం, Magha Masam Significance, Magha Masam 2024, Maghamasam, Magha, magha masam starting date in 2024, magha masam telugu, magha masam 2024 gruhapravesam dates, magha masam marriage dates

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS