చేతికి కంకణం ఎందుకు?
శ్రీ వరలక్ష్మీ వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీపూజ, వివాహం వంటి శుభకార్యాల్లోను, యజ్ఞయాగాదుల్లోను చేతికి కంకణం కట్టుకోవడం ఆచారం.
పురుషులకు కుడిచేతికి, స్త్రీలకు ఎడమచేతికి కంకణం కట్టుకుంటారు. వారు చేసిన పూజాఫలం వారికి లభించేందుకు గాను, కంకణం ఉన్నంత వరకు మనసు అటు ఇటు పోకుండా పూజ చేసాను అనే భావన మనస్సులో తొలగిపోకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు.
నూలుదారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు. కంకణాన్ని తోరం అని కూడా అంటారు.
కంకణధారణ వల్ల ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు శరీరంలోని జీవనాడుల్లో ముఖ్యనాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవడం వలన ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్తప్రసరణలతో పాటు హృదయస్పందన కూడా లయబద్ధంగా క్రమపద్ధతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నిపుణులైన వైద్యులు స్త్రీల చేతినాడిని పరీక్షించి గర్భవతా కాదా అనే విషయం చెప్పగలరు.
అంతటి విశిష్టత కలిగిన చేతిలో గల జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాల్లో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతోంది.
Tags: కంకణం, తోరం, Toranam, Kankanam, Varalakshmi Vratam Toranam, Pooja Toranam, Kankanam Telugu, Toranam Making