సుప్రభాత సేవ ఎలా జరుగుతుంది :
సుప్రభాత సేవ అంటే స్వామిని మేలుకొలుపు సేవ . రోజువారీ స్వామి కి నిర్వహించే పూజ కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమవుతాయి . మొదట బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. "సుప్రభాతము " అనగా మంచిఉదయం అని అర్ధం . హిందుపూజావిధానాలలోను , ప్రత్యేకించి శ్రీవైష్ణవాచారపరంపర లోను భగవంతునికి అనేకమైన సేవలు ( షోడశోపచారాలు ) నిర్వచించే సంప్రదాయం ఉంది. ఇలాంటి లోనేదే సుప్రభాత సేవ . ఆ ప్రభాత సేవ సమయంలో చేసే "కీర్తననే సుప్రభాతం" అని అంటారు.
ప్రతీ రోజు బ్రాహ్మీముహూర్తంలో 2:30 నుంచి 3 గంటల మధ్యలో ఈ సేవ జరుగుతుంది.
సుప్రభాత సేవ జరిగేముందు సన్నిథిగొల్ల దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖానస అర్చక స్వామి ఇంటికి , బేడీ ఆంజనేయస్వామి గుడివద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికివెళ్ళి వారిని మర్యాద పూర్వకంగా ఆలయానికి తీసుకునివస్తారు. అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తేరాడు ఉపయోగపడే కుంచెకోల అనే సదనం , తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలకశిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకునికి ధ్వజస్థంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి బంగారువాకిలిముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయాధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పాటించే వేదం పండితులు, తాళ్ళపాక అన్నమయ్యవంశస్తుడు ఒకరు తంబూరతో స్వామివారికి వేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. తాళాలు తీసిన తర్వాత సన్నధిగొల్ల బంగారు వాకిలి తెరచి దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంతో కౌసల్యా సుప్రజా రామా .. అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.
నైవేద్యం : మహంతు మఠం వారు తెచ్చిన పాలు , చక్కెర , వెన్న , తాంబూలమును నైవేద్యంగా స్వామికి పెడతారు.
మొదటి దర్శనం : దివిటీతో ముందుగా లోపలికి వెళ్లిన సన్నధి గొల్ల 'కులశేఖరపడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత అర్చకులు , ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.
శయన మండపం లో బంగారు పట్టుపరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్ధిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానం లో మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనందనిలయం లో కులశేఖర పడివద్ద ఉన్న తెరవేసి అర్చకులు శ్రీవారికి ఆచమనాదిక్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం , పాలు , చక్కెరలను నివేదనచేసి, స్వామివారికి సుగంధతాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు సుప్రభాతం ముగిస్తూ ఉండగా , లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తారు.
నవనీత హారతి :
నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీతహారతి అని పిలుస్తారు. ఆ సమయం లోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు. అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు , పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు.
నవనీత హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాదిదేవతలు శ్రీవారిని అర్చించడంకోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్ధాన్ని , చందనాన్ని , శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధిగొల్లకుకూడా తీర్ధం , శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. స్వామి వారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళమూర్తిని దర్శిస్తారు.
సుప్రభాత సేవ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు ?
తిరుమల తిరుపతి దేవస్థానం మూడు నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు , ప్రతి నెల 18 లేదా 19వ తేదీన విడుదల చేస్తున్నారు. electronic Dip ద్వారా సెలెక్ట్ చేస్తారు .మనం ముందుగా టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి
తిరుమల సుప్రభాతం సేవ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి . సుప్రభాతం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
#tirumala #tirumalasuprabhataseva tirumala latest information. tirumala information in telugu.
Very nice information.
ReplyDelete