ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినములు - Special days to worship Anjaneya Swamy

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు.

శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.

అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసి ఎందుకు పెట్టుకున్నవు తల్లీ? అని అడిగితే, శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది.

అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.

Tags: ఆంజనేయ స్వామి, Anjaneya Swamy, Hanuman, Anjaneyaswamy Puja, Hanuman Stotram, Hanuman Puja Telugu, Tamalapakulu, Hanuman chalisa Telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS