గ్రహాల అనుగ్రహం పొందాలంటే..
మానవుల జీవితాలపై గ్రహాల ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. గ్రహాలన్నీ అనుకూలిస్తే గనక జీవితం సుఖమయంగా ఉంటుంది. అవే గ్రహాలు ప్రతికూలిస్తే దుఃఖమయంగా ఉటుందని చెప్పవచ్చు. నిజానికి ఈ పరిణామాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు.
ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. మనం పుట్టిన సమయంలో గ్రహాల తీరునుబట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది అంటారు. అందుకే జాతక చక్రాలు భూమిపై ఆయా గ్రహాల ప్రసరణ వంటి వివరాల ఆధారంగానే భవిష్యత్‌ను అంచనా వేస్తారు.
గ్రహాల శుభ దృష్టి ఉంటే శుభసూచకం అని, ప్రతికూల దృష్టి ఉంటే అశుభం అని భావిస్తారు. ప్రతికూల దృష్టిగల సందర్భాలలో ఆయా గ్రహాల ప్రీతికోసం జపాలు, తర్పణాలు, హోమాలు చేయడంతో పాటుగా గ్రహ సంబంధిత క్షేత్రాలను దర్శించడం జరుగుతోంది.
దోషం, గండం వంటి వాటిని అంచనా వేయడంతో పాటు చేపట్టాల్సిన పూజాధికాల్ని జోష్యులు సూచిస్తారు. నక్షత్ర బలాన్నిబట్టి నామకరణం కూడా చేయడం ఆనవాయితీ. ఈ విషయాలకంటే ప్రదానమైన విషయం మరొకటి ఉంటుంది. పుట్టిన నక్షత్రం, రాశి ఆధారంగా స్వభావం, సహజ లక్షణాలు, పరిస్థితుల్ని అంచనా వేసుకోవడం, వాటినిబట్టి చేసే గణనలు, అంచనాలు కచ్చితంగా ఉండడమే కాకుండా రెమెడీస్‌కూడా సూటిగా ఉంటాయి.
పరిస్థితులు, మనస్తత్వాలు, కష్టాలు, నష్టాలు అన్నీ గ్రహాలను బట్టే ఉంటాయి కాబట్టి.. గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహారాధన చేస్తాం. ఈ పూజలు, అర్చనలు, దానాల సంగతి అలా ఉంచితే అంతకంటే తేలికైన మార్గం ఒకటి ఉంది.
ఒక్కో వారానికీ ఒక్కో గ్రహం అధిపతి
ఆదివారం – సూర్యుడు,
సోమవారం – చంద్రుడు,
మంగళవారం – కుజుడు,
బుధవారం – బుధుడు
గురువారం – బృహస్పతి
శుక్రవారం – శుక్రుడు
శనివారం – శని
అయితే, గ్రహాల అనుగ్రహం పొందేందుకు, ఆయా వారాల్లో మన దుస్తుల రంగులు ఇలా ఉండేలా చూసుకోవాలి.
ఆదివారం – ఎరుపు
సోమవారం – తెలుపు
మంగళవారం – నారింజ రంగు
బుధవారం – ఆకుపచ్చ
గురువారం – పసుపుపచ్చ
శుక్రవారం – తెలుపు
శనివారం – నీలం లేదా నలుపు రంగు
గ్రహాలకు ఇష్టమైన రంగులను ఉపయోగించడంవల్ల, గ్రహాలూ మనపట్ల ఆకర్షితమై అనుకూలంగా ఉంటాయని, అనుకున్న పనులు ఎలాంటి విఘ్నాలూ లేకుండా సవ్యంగా జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.
Tags: Grahalu, Sani, Chandra, Surya, Navagrahalu, Navagraha pooja, Navagraha Dosham,Temple, Devote