నమ్మండి ! నమ్మకపోండి ! అది మీ ఇష్టం ! నమ్మినవారికి ! నమ్మినంత ! Nammandi Nammakapondi

నమ్మండి! నమ్మకపోండి!*!

వివాహ సమయంలో వధూవరులు కూర్చును పేట పొడవు 37 అంగుళాలు, ఎత్తు 6 అంగుళాలు, వెడల్పు 5 అంగుళాలు ఉండాలన్నది శాస్త్ర నిర్ణయము. అందుకు భిన్నంగా ఉంటే వివాహం తదుపరి సంసార జీవితంలో సుఖము ఉండదు. సదా కలహాలతో సంసార జీవితం గడపవలసివస్తుంది.

శరీరంపైగాని, వస్త్రం పై గాని సాలెపురుగు పడి ప్రాకుతుంటే త్వరలోనే శుభం జరుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి.

గ్రామాల్లో ఇప్పటికి సున్నాన్ని కుండల్లో కలుపుకొని పండుగ రోజుల్లో ఇండ్లకు వేస్తారు. మిగిలిన సున్నాన్ని బానల్లో నిల్వ వుంచే ఆచారం ఇప్పటికి ఉంది. అది పగిలితే అన్నీ అశుభాలే జరుగుతాయి. సాంపాదించిన వస్తువులు దొంగల పాలవుతాయి.

ప్రాకే చిన్న పిల్లలు ఇంటి గడపపై కూర్చుని మలంగానీ, మూత్రం గానీ విసర్జించినట్లయితే ఆ ఇంటికి తప్పని సరిగా బంధువులు వస్తారు.

పసిపిల్లలు మన్ను తిన్నట్లు కనిపిస్తే ఆ సం॥ము ధాన్యం ధర విపరీతంగా పలుకుతుంది. గడ్డి తిన్నట్లు కనిపిస్తే పశువులకు హాని.

శిశువు యొక్క బ్రహ్మరంధ్రమునకు తల్లి యొక్క చనుమొనలు తగిలిననూ ఆమె రోగ పీడితురాలు అగును. నడుస్తున్నప్పుడు తల్లి కాళ్ళ యొక్క దుమ్ము రేణువులు పిల్ల వానిపై పడితే ఆ పసి కందు కడుపు శూలతో విపరీత భాదకు గురిఅగును.

గృహంలో బాలురు గానీ, బాలికలు గానీ, పసువుగానీ ఒలకబోస్తే ఆ ఇంటి యజమాని అప్పుల పాలౌతాడు.

ఏ గృహంపైనను ఊసరవిల్లి, మెలికల పాము ఎక్కినా ఆ గృహ యజమాని రెండు నెలలు తిరుగకుండానే కాలం చేస్తారు.

ఎవరి గృహంలో నల్లులు ఎక్కువ వుండునో, రాబడి తగ్గడమేకాక దరిద్రం దాపురిస్తున్నట్లే. ఎవరి ఇంట ఎలుకలు బాగా తిరుగుచుండునో భోజనం చేసేవారి సంఖ్య పెరుగుచుండును. బొద్దింకలు ఎక్కువగా కన్పిస్తుంటే వ్యాపారం అధికంగా పెరుగుతుందని ఈజిప్టుల నమ్మకం.

నడిచేటప్పుడు కాలి చీలిమండలో చప్పుడు వస్తే కష్టాల పాలు అవుతారు. కుటుంబానికి దూరంగా వుండవలసి వస్తుంది. ఇట్టి పరిస్థితి వలనే లక్ష్మణుడు వనవాసం చేయవలసివచ్చింది.

రెండు చేతులతోను తల గోకుకొనకూడదు. సమస్యలు పెరుగుతాయి. బుద్ధి వికలమవుతుంది. డబ్బు ప్రయాత్నాలు ఫలించవు.

అన్నం తినేటప్పుడు తుమ్మినట్లయితే వెనువెంటనే లేచి చేతులు, కడుగుకొనండి లేనిచో ఋణ, రోగ బాధలు ఎక్కువ అవుతాయి.

భోజనం చేసేటప్పుడు కడుపుపై చేయి వుంచి నిమరకండి. అది దరిద్ర దేవతకు స్వాగతం పలకటమే అవుతుంది.

చాకు, కత్తి వాటితో సరదాకైనా నేలపై గీతలు గీయకండి. అవి. మరణాన్ని కోరుతాయి.

కత్తి, చాకు వంటి వాటితో ఎదుటి వారిని చూపించవద్దు. అవి బలికోరటమే కాక, ఎదుట వారి వల్ల మీరు సమస్యలో ఇరుక్కుంటారు.

మీరు కూర్చుని ఇతరులతో మాట్లాడేటప్పుడు కాలి బొటనవ్రేలి గోరుతో నేలను గోకవద్దు. భూదేవి శాపం పెడుతుందని మన పెద్దల నమ్మకం. ఉండటానికి ఇల్లు లేకుండా పోతుంది అని పెద్దల నమ్మకం.

అసుకోకుండా, మీ ఇంట్లోకి ఒక కప్ప వస్తే త్వరలోనే మీ ఇంటికి సంపదలు వస్తున్నాయని గ్రహించండి.

ఆకారణంగా పాలు చేతి నుండి జారి నేల పాలైనట్లయితే త్వరలో శుభ కార్యముల ద్వారా ధనం ఖర్చు అవుతుంది.

విరిగిన బొమ్మలు, వెలవెల బోయె కాలెండర్లు, ఇంటిలో కన్పిస్తుంటే సుఖసంతోషాలకు దూరం అయి తెలియని బాధతో మనస్సున ఇబ్బందులు ఏర్పడుచుండును. ఆ ఇంటిలో నివసించు వారికి ఎవ్వరికి కళాకాంతులు కన్పించవు.

నేలపాలైన కుంకుమ నుదుట బొట్టు పెట్టుకుంటే భార్య భర్తల మధ్య ఎడబాటు లేదా వైధవ్య యోగము పొందవలసి వచ్చును. పెంపుడు జంతువులు కంటినుండి నీరు కారుస్తుంటే యజమానికి త్వరలోనే ఆపద సంభవింస్తుంది.

రోగంతో ఉన్న వ్యక్తిని నిండు గర్భంతో ఉన్న స్త్రీ తాకితే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది.

ప్రయాణమై వెళ్ళేటప్పుడు చెట్టుకు తగిలి వస్త్రము చినిగినా కార్యనాశనము, కలహములు, వస్త్రం కిందికి జారిపడిన అనుకోని విశేషం ఏమైన జరుగవచ్చు.

యజమానికి తన కుక్క తలను ఎడమకాలపై పెట్టకొని కానవస్తే ధనలాభం, అదేకుక్క కుడికాలుపై తలవంచుకొని పడుకున్నట్లు కన్పిస్తే నీలాపనిందలు జగడాలు, కుడికాలు మీదున్న తలను ఎడమకాలు మీద మార్చుకుస్నట్లయితే శుభ సూచిక, ఎడమకాలు మీదున్న తలను కుడికాలుపైకి మార్చుకొన్నట్లయితే ఏదో ప్రమాదం సంబవించును.

ఇంటిలోని కసువును ఈశాన్య మూలగా ఊడ్బే స్త్రీ భర్తతో సంసార జీవితం సరిగా గడపలేదు. స్త్రీ సంతతికి అరష్టం, సంపదలు హరించి దరిద్రానికి గురికావలసి వస్తుంది.

ఒక మాట కార్యహానిని సూచించును రెండు మాటలు వినిన రాజ్ చెడిపోవును. మూడు వినిన కలహము ప్రాప్తించును. నాలుగు తీవ్ర కలహములు కలుగును ఐదు వినిన పోట్లాటలు సంభవించును.

Tags: నమ్మండి ! నమ్మకపోండి, Nammandi Nammakapondi, devoties, dharma sandehalu, bhakhti samacharam, temple

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS