తిరుమల లో శ్రీవారికి మనకు మధ్య దూరం..
👉 కులశేఖర పడి నుండి 10 అడుగుల దూరం..ప్రొటోకాల్ దర్శనం L1,సుప్రభాతం, తోమాల,అర్చన,అష్టదళ పాద పద్మారాదన,అభిషేకం, వస్త్రం ఇలా ప్రత్యేక సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు కులశేఖర పడి వరకూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ 10,500/- టిక్కెట్ భక్తులు కూడా.
👉 అదే రాముల వారి మేడ నుండి లఘు దర్శనం.మనకు స్వామి వారికి 35 అడుగుల దూరం..L3 సిఫార్సు ఉత్తరం కలిగి బ్రేక్ దర్శనం 500/- టిక్కెట్లు కలిగిన భక్తులు, రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సామాన్య భక్తులకు ఈ అవకాశం.( ఇప్పుడు ఇది కష్టం)
👉 మహా లఘు దర్శనం : ఇది జయ విజయుల వరకే.. అంటే మనకి స్వామి వారికీ మధ్య షుమారు 64 నుండి 70 అడుగుల దూరం.సామాన్య భక్తులకు, కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకార సేవ,కలిగిన భక్తులకు.. చాలా వరకు మహా లఘు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
గంటకు దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య
కులశేఖర పడి వరకు 1500 మంది
రాములు వారి మేడ వరకు గంటకు 2500 మంది
జయ విజయుల దగ్గర నుండి గంటకు 5000 మందికి దర్శనం కల్పించగలరు.
గతంలో వచ్చే భక్తుల సంఖ్యను బట్టి దర్శన విధానాన్ని మార్పు చేసేవారు..ఇప్పుడు సామాన్య భక్తులకు మహా లఘు దర్శనమే అందిస్తున్నారు.
ఇప్పుడు వారాంతపు రోజులలో భక్తుల సంఖ్య 90 వేల నుండి లక్షకు చేరుకుంది.
Tags: Tirumala, TTD, Tirumala Devastanam, Tirumala History Telugu, Tirupati, Tirumala Distance, Venkateswaraswamy, TTD Tickets, Suprabhatam, Srivari Seva