కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం | పూజా విధానం - What to do on Kaal Bhairav Jayanti?

కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం | పూజా విధానం

ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది.

కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క(శునకం) అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.

ముఖ్యంగా

అసితాంగ భైరవుడు , రురు భైరవుడు ,

చండ భైరవుడు ,

క్రోధ భైరవుడు ,

ఉన్మత్త భైరవుడు ,

కపాల భైరవుడు ,

భీషణ భైరవుడు ,

సంహార భైరవుడు , అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.

కాలభైరవ వృత్తాంతం

పరమశివుడిని అవమానపరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.

శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యు దోషాలు తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.

దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.

తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |

భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||

పూజా విధానం:

శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం , మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

పూజను చేయలేనివారు శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.

కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౧ 


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౨ 


శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౩ 

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౪


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౫


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౬


అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౭

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే  ౮ 


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

కాలభైరవ అష్టమి – భైరవ పూజ ఫలితాలు

సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.

కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక. ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి , నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని… గద , త్రిశూలం , సర్పం , పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిశేకము చేయించి , గారెలతో మాల వేసి… కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్షు పెరుగును.

అంతేకాక ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ , అర్ధాష్టమ , ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.

శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి . భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.

కాలభైరవ గాయత్రి ..

ఓం కాల కాలాయ విద్మహే

కాలాతీతాయ ధీమహి

తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥

Tags: కాలభైరవ, Kala Bhairava Jayanti, Bhairava Ashtami, Kaal Bhairav, Kalabhairav Jayanti

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS