పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి?
శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించనప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు. అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి?
భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు.
పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి. పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.
సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.
పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి ఎడమ కాలి మీద పెట్టాలి. అలాగే ఎడమ చేతిని వారి కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి. ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి.
పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. ‘మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించడానికి ఆశీర్వదించండి’ అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా వారి పాదాలను తాకుతాము.
Tags: పాదాభివందనం, Namaskaram, Padabhivandanam, Blessings, old age blessings, dharma sandesalu