ఇంట్లో దీపం పెట్టవలసిన ముఖ్యప్రదేశాలేవి..
దేవుని వద్ద మొదటిసారి దీపం వెలిగించాలి. గడపకు రెండువైపులా పెట్టే దీపాన్ని దేహళీ దత్త దీపం అంటారు. గడపపైన దీపం పెట్టకూడదు.
గడపకు బయట వీధివైపు దీపం ప్రమిదలో పెట్టాలి. తులసికోట వద్ద, ధాన్యాగారం వద్ద, బావివద్ద ఈ అయిదు ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా దీపం పెట్టాలి.
ముఖ్యంగా కార్తికంలో పితృదేవతలను తలచుకుంటూ దీపం వెలిగించాలి.
ఉదయవేళలో అయితే సూర్యునికి నమస్కరించాలి. సాయంత్రవేళలో చంద్రునికి పక్కనే ఆర్థనక్షత్రం సాక్షాత్తూ శివస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది.
సాయంత్రంపూట దీపారాధన అయిన వెంటనే నక్షత్రదర్శనం చేయాలి.
పాత దీపాలను పడవేయకండి..
దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు , ఎపుడో ఒకసారి దీపాలు పెట్టె వాళ్ళు ఎలా చేసుకున్న పర్వాలేదు కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్లు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు.
మరి పాతావి దేవుడి ముందు బాగలేదు అనుకుంటే అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి లేదా కాలం చేసిన పెద్దవారి ముందు అయినా పెట్టండి కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి.
ఎందు కంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది, అవి బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవస్వరూపాలు, మన సంతోషాలు కష్టాలు, కనీళ్లు, బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం, మనము ఒక కష్టాన్ని భగవంతుడు కి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడు ని ప్రార్తిస్థాయి, మనము సంతోషం గా దీపం పెట్టి పూజ చేసి నప్పుడు భగవంతుడు కి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి.
దీపం లో నూనె అయిపోతే కొండెక్కి పోతుంది అనుకుంటారు ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలుకి తోడుగా ఉంటుంది, ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడు ని ప్రతిస్తూ ఉంటాయి అంటారు... అందుకే చాలా కాలం గా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది.. ప్రాణంవుంటుంది..పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి.
మట్టి దీపం
రోజూ దీపాలు కడిగి పెట్టే ఓపిక లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు !
లోహం దీపం ఏదైనా కడిగి పెట్టాలసిందే, మట్టి దీపాలు నిత్య దీపం కి వాడితే ఒత్తి మారిస్తే సరిపోతుంది మట్టి దీపం కడగాల్సిన పని లేదు, లోహం దీపాలు కాకుండా పాత కాలంలో మట్టి దీపాలే ఎక్కువగా వాడేవారు.. మట్టి దీపం శ్రేష్టం కూడా, పండగలు, పర్వదినాల్లో సమయం ఉంటుంది కనుక ఇత్తడి వెండి దీపాలు పెట్టుకోండి రోజూ వారి దీపారాధన లో మట్టిదీపాలు జతగా ఉంచి దీపం. పెట్టుకోండి. భగవంతుడు ముందు రోజు నీళ్లు పెట్టాలి, చిన్న బెల్లం ముక్క అయినా పెట్టాలి. మంత్రాలు చదివే సమయం లేకుంటే కులదేవత, లేక ఇంటి దేవతగా కొలిచే దైవాన్ని నామ స్మరణచేసి నమస్కరించుకోండి హారతి ఇవ్వండి భక్తిగా ఒక నమస్కారం చేయండి చాలు సమయం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోండి కానీ హడావిడిగా కాసేపు పూజకాసేపు వంట ఈ హడావుడి వద్దు.
రోజూ నూనె దీపాలు తోముతూ సమయం అవుతుంది అనుకునే టప్పడు ఓ రెండు మూడు జతలు దీపాలు అధికంగా ఉంచుకుంటే సమయం ఉనప్పుడు వాడిన దీపాలు శుభ్రం చేసుకోవచ్చు, ఇటువంటి కొన్ని నియమాలు వల్ల రోజూ దీపారాధన చేయడం లేదు అని కొందరు అన్నారు అలా అనకండి దీపం జోతి పరబ్రహ్మము అన్న పదాన్ని ఇంక ఏ కైంకర్యానికి లేదు దీపం ప్రత్యక్ష దైవం ఆ ఉద్దేశం తోనే రోజు దీపం కడిగి పెట్టమంటారు.. అందులో జోతి రూపంలో మీ ఇంటి ఇల వేలుపు కొలువై ఉంటుంది నియమాలు మన క్రమశిక్షణ కోసం శుభ్రత కోసం కొందరు 6 గం ఇంటి నుండి బయలు దేరితే కానీ వారి వృత్తి కార్యాలయానికి చేరుకోలేరు అది వారి నిత్య జీవితం అయినా శ్రమ అనుకోకుండా భక్తిగా దీపం పెట్టి వెళ్ళాలి అనుకున్నారు అందుకు సంతోషం తో కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను, ఆ దీపం అమ్మవారు ఆ దీపం అగ్ని దేవుడు ఆ దీపం మహా యజ్ఞం అది మీకు సదా రక్షణగా ఉంటుంది.. ఇటువంటి పరిస్థితి అందరూ దాటి వచ్చిన వాళ్ళమే ఉదయం 5 గం లేచి దీపారాధన చేసి పండో పాలో పెట్టి.. ప్రయాణంలో చెప్పులు విడిచి స్త్రోత్రలు నామజపం మంత్ర జపం చేసుకుంటాము,మనము తీరికగా కాళీగా పని లేనప్పుడు చేద్దాము అనుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో వినియోగించుకుందాము.. ఏ పని చేస్తున్నా నామ స్మరణ చేసుకోవచ్చు.
ప్రతి హిందువు ఇంట్లో దీపం వేలగాలి అదే మీకు రక్షణ అవుతుంది అందులోనూ అంత ఉదయాన్నే దీపం ఇంట్లో వెలగటం చాలా భాగ్యం మంత్రాలు చదివి గంటలు గంటలు స్త్రోత్రలు చదివితే నే భక్తి కాదు.. పాత కాలంలో ఆడవాళ్లకు చదువురాదు, స్ట్రోత్రాలు రాదు అయినా ఇల్లు శుభ్రంగా ఉంచుకునే రెండు పూటలా దీపారాధన చేసుకుంటూ అన్ని పండగలు తెలిసిన విధంగా నే చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళు..
ఇలా చేస్తేనే నేను ప్రసన్నం. అవుతాను అని దేవుడు ఎవరితో చెప్పలేదు ఎలా చేసిన భక్తితో చేస్తే స్వీకరిస్తాను అన్నారు అంతే అదే గుర్తు పెట్టుకోండి. ఏ దీపం పెడితే పుణ్యం వస్తుంది ఎన్ని ఒత్తులు వేస్తే పుణ్యం వస్తుంది ఈ సోది అంతా వినకండి కొత్త వస్తువులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కోసం ఎన్నో కల్పించి చెప్తారు, రోజుకు ఒక స్వామీ జీలు గురువులు పుట్టుకొచ్చి ఏవేవో అమ్ముతున్నారు ఇవన్నీ విని ఏది నమ్మాలి తెలియని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి tv షో లు యూట్యూబ్ లు ఆడవాళ్లకు తెలియదు కనుక ప్రశాంతంగా పూజ చేసుకునే వారు ఇప్పుడు వెర్రి వాళ్ళు అయిపోతున్నారు. నువ్వు బంగారు దీపంలో పెట్టిన అందులో కూడా ఒత్తి నూనె కానీ నైయి కాని పోయాలి అలాగే వెలిగిపోదు, అలాగే పెట్టె సమయంలో మీ మనసు మీరు పెట్టె టైం మీకు ఫలితాన్ని ఇస్తుంది.
ఉదాహరణకు సూర్యోదయానికి 40 ని ముందు దీపం వెలిగించి విష్ణు సహాస్రనామం క్రమంగా చేస్తూ ఉంటే ఒక నెల రోజుల్లో మీ జీవితం లో ఊహించని మంచి పరిణామాలు జరుగుతుంది అంటే ఉద్యోగం వ్యాపారం వివాహం సమస్యలు అన్ని తొలగి పోతుంది అయితే రోజు అదే సమయంలో పాటించాలి అప్పుడే ఫలితం ఉంటుంది, అలాగే లలితా సహాస్ర నామం కూడా సమయం నియమంగా పాటిస్తూ చేస్తే మీకు అద్భుతమైన ఫలితం దక్కుతుంది గొప్ప పరిస్కారం అవుతుంది ఇది తెలియక ఏవేవో తాయత్తులు యంత్రాలు, తాంత్రిక పూజలు మంత్రాలు అంటూ కొత్తస్వాములను తయారు చేస్తున్నారు.. అలా అని అందరూ అలా ఉండరు నమ్మాలి నమ్మకం ఉండాలి గుడ్డిగా అన్ని నమ్మకూడదు మూఢ నమ్మకం ఉండకూడదు. సమయం పాటించి చేసేది నిత్య అనుష్ఠానం అంతే కాని పెట్టే దీపం ఖరీదు ని బట్టి పుణ్యం రాదు.
పెద్ద వారి కాలంలో దీపం కోసం దీపంగూడు (దీపం గుడి)అని ఉంచే వారు అందులో ఒత్తి మార్చే వారు కానీ రోజూ మట్టి దీపం కుందులు మార్చే ఆనవాయితి ఇది వరకు లేదు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు కొత్త కొత్త సంప్రదాయం అలవాటు చేస్తున్నారు. అవన్నీ బుర్రలోకి ఎక్కితే ఎదో సామేత చెప్పినట్టు ఉన్నది కాస్త పోతుంది..
ముఖ్యమైన విషయం:- ఉదయం సమయం సరిపోదు అని రాత్రే దీపాలు కొండెక్కాక కదిలించి కడగడం పూజ గది శుభ్రంచేయడం ఇటువంటి పనులు చేయకూడదు.. స్పేర్ గా ఇంకా ఉంటే అది శుభ్రంచేసుకోవచ్చు.
Tags: దీపం, Karthika Deepam, Karthika Masam, Lamp, house, home, Deepam at home