ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు పంచారామ క్షేత్రాలు - What are the 5 Pancharamas?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.

దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.

భీమేశ్వరుడు- దక్షారామం (ద్రాక్షారామం, కోనసీమ జిల్లా)

భీమేశ్వరుడు- కుమారారామం (సామర్లకోట, కాకినాడ జిల్లా)

రామలింగేశ్వరుడు- క్షీరారామం (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)

సోమేశ్వరుడు- భీమారామం (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)

అమరేశ్వరుడు- అమరారామం (అమరావతి, పల్నాడు జిల్లా)

1.దాక్షారామము -

draksharamam


పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము కోనసీమ జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

draksharamam

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

draksharamam drone view


ద్రాక్షారామం ఆలయ సమయాలు : ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయ సమయాలు ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 వరకు & మధ్యాహ్నం 12.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు తెరిచి ఉంటాయి.

ఎక్కడ ఉంది : ద్రాక్షారామం కాకినాడకు 55 కిమీ , 43 కిమీ దూరం లో ఉంది. కాకినాడ రాజమండ్రి నుంచి బస్సు లు ఉంటాయి. ద్రాక్షారామం దగ్గర్లో కోటిపల్లి ఉంది తప్పకుండా చూడాల్సిన శైవ క్షేత్రం

2.అమరారామము -

పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.

గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.

amaravathi temple


అమరావతి ఆలయ సమయాలు:

ఉదయం : 6.00 AM నుండి 12.00 మధ్యాహ్నం

సాయంత్రం : 4.00 PM నుండి 8.00 PM వరకు

3.క్షీరారామము -

క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.

క్షీరరామ ఆలయ సమయాలు : క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ సమయాలు : 

ఉదయం : 5:30 am–12:30 pm,

సాయంత్రం : 4.00 pm - 8:30 pm

4.సోమారామము -

పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.

సోమరామ ఆలయ సమయాలు : సామర్లకోట కుమార భీమేశ్వర ఆలయ సమయాలు ఉదయం 6 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు.

5.కుమార భీమారామము -

పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమారభీమారామం క్షేత్రం ఉంది. సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

సామల్‌కోట్ ఆలయ సమయాలు : సామల్‌కోట్ కుమార భీమేశ్వర ఆలయ సమయాలు :

ఉదయం : 6.00 నుండి మధ్యాహ్నం 12.00 మరియు

మధ్యాహ్నం : సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 వరకు.

Tags: పంచారామ క్షేత్రాలు, Pancharamalu, Pancharamam Temples, Andhra Pradesh temples, Pancharamalu Darshan Tour, Pancharamalu list, lord shiva temples

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS