నవగ్రహ దోష కారకమైన పనులు
1. సూర్యుడు
పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.
2.చంద్రుడు
అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.
3.కుజుడు
అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.
4.బుధుడు
బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపము.
5. గురువు
సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.
6. శుక్రుడు
శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.
7. శని
శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.
8. రాహువు
రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును. ఈయన భ్రమ మాయ కి కారణము.
9. కేతువు
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.
Tags: నవగ్రహ,Navagraha Dosha, Astrology, Navagraha Dosham Telugu, Navagraha Remedies, Dosham Pariharalu