ఏ రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
తొండం ఎడమ వైపుకు ఉన్నది
వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారట.
తొండం కుడి వైపుకు ఉన్నది
వినాయకుడి తొండం కుడి వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే అనుకున్న కోర్కెలు త్వరగా నెరవేరుతాయట.
అయితే ఈ తరహా వినాయకుడి విగ్రహాలను పూజించేటప్పుడు నియమ నిబంధనలు, నిష్టను కచ్చితంగా పాటించాల్సిందేనట. లేదంటే ఫలితం దక్కకపోగా విపరీత పరిణామాలు ఏర్పడుతాయట.
తొండం మధ్యలో ఉంటే
వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట. ఇంట్లోని కుటుంబ సభ్యులకు శక్తి లభిస్తుందట.
తెలుపు రంగు
తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఇంట్లో శాంతి ఉంటుందట. సాధారణంగా ఇంట్లో, దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారట.
రావి ఆకు వినాయకుడు
రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇంట్లో అందరికీ అన్నీ శుభాలే కలుగుతాయట.
పలు రకాల ఇతర విగ్రహాలు :
వెండి గణేషున్ని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు,
చెక్క రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఆరోగ్యం,
ఇత్తడి గణేషున్ని పూజిస్తే సంతోషం,
మట్టి గణపతిని పూజిస్తే శుభం కెరీర్‌లో సక్సెస్ లభిస్తాయట..
Tags: గణపతి, Vingayaka, Ganapathi, Ganapathi idols, Siva, Vinayaka chavithi, Ganapathi stotram, Ganapati pooja