నాగులచవితికి పుట్టలో పాలుపోసేందుకు వెళ్లేముందు..ముందుగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టి నమస్కరించి.. చేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు , పండ్లు కొంత నైవేద్యం పెట్టి ఆ తర్వాత పుట్టదగ్గరకు వెళతారు.
పుట్ట దగ్గర షోడసోపచార పూజలేమీ అవసరం లేదుకానీ అవకాశం ఉంటే నవగాన స్త్రోత్రం, సర్ప సూక్తం చదువుకుంటే మంచిదంటారు పండితులు. పుట్టదగ్గర అంత సమయం ఉండనివ్వరు కదా అనుకుంటే..ఇంట్లో దీపం పెట్టేటప్పుడు చదువుకుని పుట్ట దగ్గరకు వెళ్లినా మంచిదే.
నాగులచవితి రోజు పుట్టలో పాలు పోస్తూ పాటించవలిసిన శ్లోకం:-
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
ఆవు పాలు పుట్టలో పోసి నాగ పూజచేసి చలిమిడి, పానకం, అరటిపళ్లు మొదలగునవి నివేదన చేస్తారు. ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ|
రుతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
Famous Posts:
> నాగుల చవితి ఎప్పుడు? నాగుల చవితి ముహూర్త సమయం
> నాగుల చవితి పూజ విధానం - ఇలా చేస్తే సంతాన ప్రాప్తి
Tags: Nagula Chavithi, Nagula Chavithi Slokas in Telugu, Chavithi, Nagula Chavithi Date, Naga Panchami