హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది? Benefits of Various Types of Homam

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది?

అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు.

ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు అని భావిస్తున్నాను.

గణపతి హోమం

విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు వినాయకుడు. మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని వినాయకుడిని పూజిస్తారు.

జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చెయ్యాలి. గణపతి హోమం చేయడం వలన విజయము,ఆరోగ్యము,సంపద కార్య సిద్ధి కలుగుతాయి.మన హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభిస్తారు.

రుద్ర హోమం

రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, 

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారుఅని పురాణాలు చెబుతున్నాయి. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు.ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.

చండీ హోమం

మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ మాత. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి,సిరిసంపదల కోసం చండి హోమం చేస్తారు. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి అంటారు.

చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి,నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది.

గరుడ హోమం

శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే ఈగరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం ,అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం,

అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది. విద్య అభివృద్ధి కలుగుతుంది.

సుదర్శనహోమం

మహావిష్ణువుకు అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. జీవితంలో లేక కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి ,నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేస్తారు. 

గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం చేస్తారు. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేస్తారు.

మన్యుసూక్త హోమం

మన వేదాలనుసరించి మన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని అర్థం. మన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం ఈ హోమాన్ని చేయాలి.

లక్ష్మీ కుబేర పాశుపతహోమం

సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని మనం పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం చేసేదే ఈ లక్ష్మి కుబేర పాశుపత హోమం.మానవ జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని ,కుబేరుడిని ఈ హోమంలో పూజిస్తారు. ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వారం అంటాం కదా.

మృత్యుంజయ పాశుపత హోమం

మానవుడు మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.ఆ పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటారు. 

ప్రాణ హాని ,తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేస్తారు. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది.

నవదుర్గ పాశుపత హోమం

ఇలలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది..

Tags: హోమం, Homam, sudarshana homam, types of homam, benefits of homam at home, Homam List

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS