తిరువణ్ణామలైలో 10 రోజుల పాటు కార్తిక మహాదీపోత్సవాలు వాటి వివరాలు - Karthigai deepam 2023 Festival Date Thiruvannamalai

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవాలు ప్రధానమైనవి. పది రోజులు జరుగుతాయి. ముందుగా మూడు రోజులు.. ముగిసిన తర్వాత మరో మూడు రోజులు వేడుకలు కొనసాగుతాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం తరఫున భారీ ఏర్పాట్లు చేశారు.

తొలిరోజు ఆలయంలో దుర్గమ్మ ఉత్సవం 14న (మంగళవారం) జరుగుతుంది.

2వ రోజు బుధవారం సింహ వాహనంపై పిడారి అమ్మన్ ఉత్సవం ఉంటుంది.

మూడోరోజు గురువారం వెండి మూషికవాహనంపై వినాయకస్వామి, వృషభ వాహనంపై చండికేశ్వరర్ ఊరేగింపు నిర్వహిస్తారు.

17న శుక్రవారం కార్తిక మహాదీపోత్సవాలు వేకువజామున 4.45 నుంచి 6.12లోపు ధ్వజారోహణతో ప్రారంభమవుతాయి. ఉదయం పంచమూర్తులు వెండి విమానాల్లో ఊరేగుతాయి. రాత్రి వెండి అధికార నంది, హంస వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతారు.

శనివారం ఉదయం చంద్రశేఖరస్వామి బంగారు సూర్యప్రభ వాహనంపై, వినాయకస్వామి మూషిక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు రాత్రి పంచమూర్తులు వెండి ఇంద్ర విమానాల్లో ఊరేగుతారు.

ఆదివారం ఉదయం చంద్రశేఖరస్వామి భూతవాహనంపై, రాత్రి పంచమూర్తులు సింహ, వెండి హంస వాహనాలపై ఊరేగుతారు.

సోమవారం ఉదయం చంద్రశేఖరస్వామి సర్ప వాహనంపై, రాత్రి పంచమూర్తులు వెండి కామధేనువు, కర్పగ వృక్ష వాహనాలపై దర్శనమిస్తారు.

మంగళవారం ఉదయం చంద్రశేఖరస్వామి అద్దాల వృషభ వాహనంలో, రాత్రి పంచమూర్తులను వెండి పెద్ద వృషభ వాహనాల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తారు.

బుధవారం చంద్రశేఖరస్వామి వెండి గజవాహనంలోను, 63 నాయన్మార్ల వీధి ఊరేగింపు జరుగుతుంది. రాత్రి పంచమూర్తులు వెండి రథం, వెండి విమానాలలో ఊరేగుతారు.

గురువారం రథోత్సవం ఉంటుంది. పంచమూర్తులను పంచరథాల్లో ఊరేగిస్తారు.

శుక్రవారం ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరస్వామి, సాయంత్రం 4.30కు పంచాండవర్ ఉత్సవం, రాత్రి పంచమూర్తులను అశ్వవాహనాలపై ఊరేగిస్తారు.

శనివారం చంద్రశేఖరస్వామి పురుష మృగవాహనంపై, రాత్రి పంచమూర్తులు కైలాస వాహనం, కామధేనువు వాహనాల్లో ఊరేగుతారు.

చివరి రోజైన 26న(ఆదివారం) వేకువజామున 4 గంటలకు ఆలయంలో భరణిదీపం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు కొండపై మహాదీపం వెలిగిస్తారు. రాత్రి పంచమూర్తులు బంగారు వృషభ వాహనాల్లో ఊరేగుతారు.

మహాదీపోత్సవాలు ముగిసిన మరో మూడు రోజులు ఆలయ కోనేరు అయ్యంగ్ గుంటలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం రాత్రి చంద్రశేఖరస్వామి, మంగళవారం వేకువజామున అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ జరుగుతాయి. రాత్రి 9 గంటలకు పరాశక్తి అమ్మవారు తెప్పోత్సవం, బుధవారం రాత్రి సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవం జరుగుతాయి. 30న చండికేశ్వరర్ వెండి వృషభ వాహనంపై తెప్పోత్సవం చేస్తారు.

Tags: తిరువణ్ణామలై, కార్తీక మాసం, Karthigai Deepam, Tiruvannamalai Karthigai Deepam, Arunachalam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS