దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా?
1. శైలపుత్రి
ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.
2. బ్రహ్మచారిని
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.
3. చంద్రఘంట
శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశ భుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దరికి రావు అని నమ్మకం.
4. కూష్మాండ
శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహ వాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.
5. స్కందమాత
నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.
6. క్యాత్యాయని
నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడి కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనం ఇచ్చే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
7. కాళరాత్రి
నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.
8. మహాగౌరి
నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.
9. సిద్ధిధాత్రి
శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.
ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా. ఈ తొమ్మిది అవతారాలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.
Click here: 2023 దసరా నవరాత్రుల తేదీలు & అలంకరణలు
Tags: దసరా నవరాత్రులు, దుర్గాదేవి, devi navaratri 2023, Navratri 2023 Dates, Dashami DateS, Nine Avataras