"మానవీయ విలువలు" అంశముపై మూడు రోజుల పాటు సిధ్ధిపేట నగరములో పూజ్య గురువుగారు అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రసంగములు చేసారు. కొన్ని వేల సంఖ్యలో హాజరైన ప్రజలు ఈ ప్రవచనములు తమను ఎంతగానో ప్రభావితం చేసాయని, తమకు నిత్య జీవితములో మంచి విలువలతో జీవించటానికి ఎంతగానో ఉపయోగపడతాయని తమ సంతోషమును వ్యక్తం చేసారు.
చివరి రోజున (2-10-2023) తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ T.హరీష్ రావు గారు ప్రవచనమునకు హాజరై, శ్రీ చాగంటి వారి ప్రవచనములు మృదు మధురమైన భాషతో, స్నేహపూర్వకమైన శైలితో అందరిలోనూ మంచి మార్పు తీసుకువస్తున్నాయి అని కొనియాడారు. వారు శ్రీ చాగంటి వారిని "అభినవ బ్రహ్మ"గా, "ఆధ్యాత్మిక మరియు సామాజిక విప్లవము"గా అభివర్ణించి, శ్రీ చాగంటి వారి దంపతులను సత్కరించారు.
ఈ ప్రవచన పరంపర రేపటి నుండి శ్రీగురువాణి యూట్యూబ్ ఛానలులో ప్రసారమగును.
#SriChagantiPravachanamulu #ChagantiLatestPravachanamulu #sriguruvanichaganti #sreeguruvani
Tags
Chaganti