అభిషేక ప్రియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరించవచ్చు..!! Benefits of Lord Shiva Abhishekam

అభిషేక ప్రియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరించ వచ్చు..!!

ధారాభిషేకం:-

కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం:-

జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం:-

తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం:-

చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం:-

శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

Tags: lord shiva, Abhishekam, Shiva Stotram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS