శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము తిమ్మరాజు విశ్వపతి Sri Venkateswara Vratakalpamu Book Free Download

 

sri venkateswara vrakalpamu free download

ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు.

ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం, నమ్మిన వారికి కొంగుబంగారం, అనంతుడు, ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు.

శ్రీ వేంకటేశ వ్రతకల్పం 2005లో వ్రాయడం జరిగింది. ఇదంతా శ్రీ శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు. కలియుగమున మనలనందరిని అనేక బాధల నుండి రక్షించడానికి యీ శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పమును ఆ స్వామి అనుగ్రహించాడని నా నమ్మకం. 2005 నుండి ప్రతి ఆరు నెలలకు వీలున్నన్ని పుస్తకములు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు యీ పుస్తకం పదునొకండు భాషలలోనికి అనువదించబడినది. దేశ విదేశాలలోని లక్షలాది భక్తులచే నిత్యం ఆచరింపబడుతున్నది. యీ వ్రతము చేసిన వారి నుంచి వారికి జరిగిన అనేక అద్భుత, సంతోషాలను వివరిస్తూ ఎన్నో ఫోను కాల్సు, ఎన్నో వుత్తరాలు, మరెన్నో 'ఈ-మెయిల్స్ వస్తున్నాయి. ప్రతి శనివారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు యీ కథలను చదువుతున్నారు. అందువలన వారి జీవితము ఎంతో శుభప్రదంగా సుఖసంతోషాలతో గడుస్తున్నదని అంటున్నారు. ఆ శ్రీనివాసుడు ఎంతో దయామూర్తి. తన భక్తులంటే ఆ స్వామికి, అనురాగం, ఆప్యాయత. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యీ వ్రతం ఇంత విశేష ప్రాచుర్యం పొందిందంటే ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు.

ఈ పదేళ్ళుగా ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఈ ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు

కలియుగంలో ఇంతకుమించిన దైవం మరొకరు లేరు. ఇందువలననే తిరుమలను రోజూ కొన్ని వేలమంది దర్శిస్తూ, స్వామివారిని సేవిస్తున్నారు.

శ్రీనివాసుని లీలలు అద్భుతం, ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వేంకట తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు.

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం ఆ స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఈ కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయట పడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు. అన్ని బాధలూ తొలగి పోతాయి.

ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల కొండపైన రచించడం జరిగింది. మిగిలిన నాలుగు అధ్యాయాలు మహా మునులైన విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ఠ, అత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది. మహా తపస్సంపన్నులైన వారి అనుగ్రహం కలగడం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తున్నాను.

ఈ అధ్యాయాలు వ్రాస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతులు అద్భుతం. వ్రాస్తున్నంతసేపు ఆ దేవ దేవుని దివ్య చరణాలు ఆ మహామునుల పవిత్ర పాదాలే నా మదిలో స్మరిస్తూ, ప్రార్థిస్తూ రచన సాగించాను.

ఈ వ్రతం ఆచరించడం ఎంతో సులభం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించి నట్లుగా ఎవరి శక్తి కొలదీ వారు ఈ వ్రతం ఆచరించవచ్చు. ఎంతటి కష్టమైనా ఈ వ్రతమాచరించిన కొన్ని క్షణాలలోనే తొలగిపోగలదు. అయితే ఆచరించేటప్పుడు మాత్రం భక్తి ప్రధానం. ప్రశాంత చిత్తంతో పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాలమీద ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు.

కలియుగ వాసులైన మనందరి కష్టాలూ, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ ఆ శ్రీమన్నారాయుణుడికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకొనడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు, ఆ స్వామివారు. ఆచరించిన వారికి, వ్రత కథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి.

Sri Venkateswara Vratakalpamu Book Free Download 

శ్రీవేంకటేశ్వర వ్రతకల్పము సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి . 

sri venkateswara vratakalpamu book free downlaod, viswapathi venkateswara vratakalpamu book donwload, tirumala, tirumala venkateswara swamy vratamu book download,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS