తులసి మొక్కను పెంచుతున్నవారు ఈ ఐదు నియమాలు తప్పక పాటించాలి..!!
పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు..ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు.. తులసిమొక్క కాడ వెయ్యగానే తూగుతాడు. అదీ తులసికి ఉన్న దైవ శక్తి. హిందూ ఆచార సంప్రదాయాల్లో తులసికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
అందుకే తులసికి ప్రత్యేకగా కోటలో ఉంచి పూజిస్తారు. ఐతే తులసిని ఎలా బడితే అలా పెంచకూడదు అంటుంది శాస్త్రం. అందుకు శాస్త్రంలో ఉన్న ఐదు వాస్తు నియమాలు తెలుసుకుందాం.
• తులసిమొక్క లేదా తులసి కోటను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిక్కున ఉంచాలి. ఈ దిక్కులను శుభాలను కలుగజేసే దిక్కులుగా చెబుతారు. ఈ దిక్కులను దివ్యమైనవిగా అలాగే శుభాలను కలుగజేసే దిక్కులుగా శాస్త్రం పరిగణించింది.
• తులసి మొక్కను ఉంచిన ప్రదేశం చాలా శుభ్రంగా, బాగా కాంతి వచ్చేది అయి ఉండాలి. చీకట్లో ఈ మొక్కను ఉంచరాదు. తుక్కు, దుమ్ము ఉన్న చోట తులసిని ఉంచితే.. ఇంట్లోకి దరిద్రదేవత చేరుతుంది.
• తులసి మొక్కను కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. అంటే తులసి కోటలో గానీ, ఏదైనా కుండీలోగానీ ఉంచొచ్చు. ఎత్తులో ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల సంక్షేమం పెరుగుతుంది. స్థిరమైన అభివృద్ధి ఉంటుంది.
• తులసి మొక్కకు రోజూ తప్పనిసరిగా నీరు పొయ్యాలి. తులసి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే.. అంతగా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. తద్వారా ఆ కుటుంబంలో అందరికీ అదృష్టం కలిసొస్తుంది.
• తులసి మొక్కకు రోజూ ఉదయం వేళ పూజ చెయ్యాలి. కొంతమంది తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు ప్రమిదలో జ్యోతిని వెలిగిస్తారు. ఇలా తులసి చెంత ఏ పూజలు చేసినా.. ఆ ఇంట్లో వారికి మంచి అభివృద్ధి ఉంటుంది.
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Tags: తులసి మొక్క, Tulasi Plant, Tulasi, Tulasi Pooja, Tulasi at Home, Tulsi be placed at home