కొత్త అమావాస్య రోజున ఏమి చేయాలి...?
'కొత్త అమావాస్య' అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు. ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి , ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.
సరైన సమాధానం లభించక సతమతమైపోతుంటారు. అయితే శాస్త్రాన్ని అనుసరించి నడచుకునే వాళ్లకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది.
ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది.
ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ? ఎలాంటి కార్యక్రమాలని నిర్వహించాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతుంటారు.
ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం , తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు.
అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయని చెప్పబడుతోంది.
చేయకూడనివి..
- ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు.
- ఈరోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు.
- ఈరోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి.
- ఈరోజున కచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. కలయికలో పాల్గొనకూడదు.
- ఈరోజున కోపంగా ఉండకూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి.
చేయాల్సినవి..
- ఫాల్గుణ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
- ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమ శివుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు.
- ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- ఈరోజున కచ్చితంగా ఉపవాసం ఉండాలి.
- ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలను వెలిగించాలి.
- పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈరోజున పూర్వీకులకు తర్పణం చేయాలి.
- ఈరోజున పూర్వీకులను సంత్రుప్తి పరిస్తే.. మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.
తెలుగు రాశిఫలాలు 2023-2024
- మేషరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం