శ్రవణ నక్షత్రంలో పుట్టినవారి గుణగణాలు - Shravana Nakshatra Gunaganas | Astrology in Telugu

శ్రవణ నక్షత్ర జాతకుల గుణగణాలు

శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం.

ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి.

ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు.

విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది.

ఒక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం.

అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు.

వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

Related Posts:

అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు

Tags: శ్రావణ నక్షత్రం, Shravana Nakshatra, Characteristics Of Shravana Nakshatra, Shravana Nakshatram Telugu, Shravana Nakshatra Qualites,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS