ఆశ్లేష నక్షత్రము గుణగణాలు
ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు.
ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు.
అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు.
వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు.
ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.
లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల(జవుళీ)వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు.
గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు దూరముగా ఉంటారు. ఒడు దుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది.
Related Posts:
> అశ్విని నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> భరణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> కృత్తిక నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రోహిణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మృగశిర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆరుద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పునర్వసు నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పుష్యమి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఆశ్లేష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వఫల్గుణి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> హస్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> చిత్త నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> స్వాతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> విశాఖ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> అనూరాధ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> జ్యేష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> మూల నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాఆషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శ్రవణము నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ధనిష్ట నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> శతభిష నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> పూర్వాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> ఉత్తరాభద్ర నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
> రేవతి నక్షత్రములో పుట్టినవారి గుణగణాలు
Tags: ఆశ్లేష నక్షత్రం, Characteristics Of Ashlesha Nakshatra, Ashlesha Nakshatra, Ashlesha Nakshatram Telugu, Ashlesha Star, Ashlesha Nakshatram Qualities