వివాహయోగ్య కన్య - వివిధ రకాల వివాహాలు - Marriageable virgin - Different types of marriages

వివాహయోగ్య కన్య - వివిధ రకాల వివాహాలు..

బ్రహ్మచారి తల్లికి చెందిన ఏడుతరాల వారి ఇంటి పేర్లలో ఏ ఒక్కపేరూ, తను పెళ్ళిచేసుకోబోయే కన్య ఇంటిపేరు ఒక్కటి కాకూడదు. అలాగే బ్రహ్మచారి తండ్రి గోత్రం కన్య తండ్రి గోత్రం ఒకటికాకూడదు.

ఈ రెండు లక్షణాలు లేసి కన్యని వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోబోయే కన్యకి కనీసం ఒక్కడైనా సోదరుడుండాలి. అంతేకానీ ఒకే సంతానంగా పెరిగిన కన్యని వివాహం చేసుకోకూడదు. ధర్మాచరణ సక్రమంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ తమ వర్ణంలో వున్న స్త్రీలనే వివాహం చేసుకోవాలి.

వివాహాలలో మొత్తం ఎనిమిదిరకాలున్నాయి. అవి 1. బ్రహ్మం 2. దైవ 3. ఆర్ష 4. ప్రాజాపత్య 5. అసుర 6. గాంధర్వ 7. రాక్షస 8 పైశాచ అనేవి.

1. బ్రహ్మ వివాహం : యజ్ఞం చేస్తున్న ఋత్విజుణ్ణి అలంకరించి, పూజించి శాస్త్రోక్తంగా కన్యనిచ్చి వివాహం జరిపించటం

2. దైవ వివాహం : యజ్ఞం చేస్తున్న ఋత్విజుణ్ణి అలంకరించి, పూజించి శాస్త్రోక్తంగా కన్యనిచ్చి వివాహం జరిపించటం

3. ఆర్ష వివాహం : వరుడినుంచి అతనికి కాబోయే మామగారు ధర్మబద్ధంగా రెండు జతల ఆవుల్ని, ఎద్దుల్ని స్వీకరించి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం 4. పాజాపత్య వివాహం: పెద్దలు కాబోయే పెళ్ళికూతురు పెళ్ళి కొడుకుల్ని ఒకచోట చేర్చి “మీ ఇద్దరూ ఈనాటి నుంచి గృహస్థ ధర్మాన్ని ఆచరించండి” అని చెప్పి వారిద్దరికీ వివాహం జరిపించటం.

5. అసుర వివాహం : వరుడు స్వచ్ఛందంగా, తాను వివాహం చేసుకోబోయే కన్యకి, ఆమె తండ్రికి, బంధువులకీ, యథాశక్తి ధనధాన్యాల్ని సమర్పించి కన్యని వివాహం చేసుకోవటం.

6. గాంధర్వ వివాహం : ఎవరి అనుమతీ లేకుండా వరుడు కన్య పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకునే వివాహం.

7. రాక్షస వివాహం: కన్యకి ఇష్టం లేకపోయినా ఆమెని అపహరించి బలవంతంగా పెళ్ళిచేసుకోవటం

8. పైశాచ వివాహం: అన్నిటికన్నా అధమమైనది ఈ పద్దతి నిద్రపోతున్న కన్యని, లేదా కామగ్రస్తురాలిని, పిచ్చి పట్టినదానిని, ఎవరూ చూడకుండా ఎత్తుకుపోయి చేసుకునే వివాహం.

బ్రహ్మవివాహం ద్వారా జన్మించిన పుత్రుడు అటు ఇటు పది తరాల వారినీ ఉద్ధరిస్తాడు. దైవ వివాహం వల్ల ఆ దంపతులకి జన్మించిన కుమారుడు అటు ఇటు ఏడుతరాలవారిని తరింపచేస్తాడు. ఆర్ష వివాహం జరుపున్న దంపతుల పుత్రుడు అటు ఆరు ఇటు ఆరు తరాలవారిని, ప్రాజాపత్య పద్ధతిలో వివాహం జరుపుకున్న దంపతుల కుమారుడు అటు ఇటు ఆ తరువాత వారినీ ఉద్ధరిస్తాడు.

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Tags: వివిధ రకాల వివాహాలు, కన్య, Marriageable virgin, Different types of marriages, Marriage Types Telugu, Hindu Marriages Type Telugu, Vihavam, Womens Marriage, Pelli

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS