శనిదేవుని అనుగ్రహనికి సుందర కాండలోని 48 వ సర్గ ను పఠించాలి.
శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శని వారం ఉదయం, సాయంకాలం పఠిస్తే శని దేవుని అనుగ్రహం పొందగలరు. శని దేవుని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండలోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తి తో పఠిస్తే శని దేవుని అనుగ్రహం పొందుతారు.
శని వారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. ’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’ అంటే ప్రతి శని వారం భరతుడు హనుమను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం .
‘’మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్
సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే
తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా‘’
శని వారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది. సకల శ్రేయస్సును ఇస్తుంది.
తైలం తో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశో వంతు లైన పుత్రులు కలుగుతారు .
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
Tags: శని, సుందర కాండ, Shaniswaran, Shani bhagav, Sundarakanda, Hanuman, Anjaneya, Shani Slokas, Sundarakanda Telugu