శ్రీ శోభకృతు నామ సంవత్సర (ఉగాది) 2023-2024 మేష రాశి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం మరియు అవమానం.
మేష రాశి (Mesha Rasi phalalu 2023)
అశ్వని 4 పాదములు ; భరణి 4పాదములు; కృత్తిక 1వ పాదము
ఆదాయం :- 5, వ్యయం :- 5,
రాజపూజ్యం :- 3 అవమానం:- 1
కుటుంబ ఆర్ధిక పరిస్ధితి సంవత్సర ద్వితీయార్ధమున మెరుగవుతుంది. ఆరోగ్యము విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. వ్యాపారస్తులకు తగిన లాభములు కలుగుతాయి. తరచు ప్రయాణములు చేస్తారు. ఆస్థి వ్యవహారములు, కోర్టు వ్యవహారములు పరిష్కారం అవుతాయి. గృహము నందు శుభకార్యక్రమములు జరుగుతాయి. కళాకారులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది. సాంకేతిక రంగము వారు అభివృద్ధి చెందుతారు. వ్యవసాయదారులు నూతన పంటలు వేయుటకు ఆసక్తి కనబరుస్తారు. బంధువర్గము వారితో జాగ్రత్తగా ఉండవలెను.
ఉద్యోగము సంతృప్తికరముగా ఉంటుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించవలెను. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగము వారు సమయానికి ధనము అందక ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారముల యందు మంచి మంచి ఫలితములు సాధిస్తారు. కార్యక్రమములలో పాల్గొంటారు. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పురోహితులకు, పండితులకు సంఘము నందు మంచి గౌరవము లభిస్తుంది. విదేశీయానము చేసే అవకాశము ఉన్నది. వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండవలెను. ఈ సంవత్సరం ఈ రాశివారికి శు భాశుభ మిశ్రమముగా ఉంటుంది.
2023 లో మేషరాశి వారికి అదృష్ట సంఖ్య
మేషరాశి కి అధిపతి అంగారకుడు మరియు మేషరాశి స్థానికులకు అదృష్ట సంఖ్య 6 మరియు 9గా పరిగణించబడుతుంది.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేష రాశి ఫలాలు 2023 ఈ స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుందని మరియు మీరు జీవితంలోని అన్ని అంశాలలో విజయం సాదిస్తారని అంచనా వేస్తున్నారు.2023 లో మీకు శని మరియు బృహస్పతి యొక్క శుభ ఫలాలు లభిస్తాయి ఇది మిమల్ని జీవితంలో మంచి స్థితికి తీసుకువస్తుంది మరియు వృత్తిలో విజయాన్ని పొందుతుంది.2023 లో మీ అదృష్ట సంఖ్యలు 1, 6 మరియు 7 గా ఉంటాయి.ఈ సంవత్సర స్వల్ప కాలపు పోరాటాల తర్వాత ఫలవంతమైన సమయాన్ని సూచిస్తుంది.
మేష రాశి జ్యోతిష్య పరిహారాలు
మంగళవారం , మీరు హనుమాన్ చాలిసాతో బజరంగ్ బాన్ పాటించాలి.
మీరు బుధవారం సాయంత్రం ఒక మతపరమైన ప్రదేశంలో నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి.
ఇంట్లో మహామ్రుతుంజయ యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజూ పూజించండి.
పసుపు బియ్యం వండి బృహస్పతి మరియు సరస్వతి దేవిని పూజించండి.అలాగే వారికి మీ కోరికను తెలియజేయండి.
వీలైతే గురువారం నాడు ఉపవాసం పాటించండి మరియు తలస్నానం చేసిన తర్వాత మీ నుదుటి పై ప్రతిరోజూ పసుపు మరియు కేసర్ ను రాసుకోండి.
తెలుగు రాశిఫలాలు 2023-2024
- మేషరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2023-2024 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: మేష రాశి 2023, మేషరాశి వార్షిక ఫలాలు 2023 , Aries Horoscope 2023, 2023 Mesha Rasi phalalu, 2023 Mesha Rasi Phalalu Telugu, Aries Horoscope 2023, Telugu Rasi Phalalu 2023, Mesha Rasi 2023, Mesha Rasi 2023 Telugu