2023 Kanya Rasi Phalalu | Virgo Horoscope 2023 - కన్యా రాశి ఫలితాలు 2023

శ్రీ శోభకృతు నామ సంవత్సర (ఉగాది) 2023-2024 కన్యా రాశి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం మరియు అవమానం.

కన్యారాశి (Kanyarasi phalalu 2023)

ఉత్త 2,3,4 పా, హస్త 1,2,3,4 పా, చిత్త 1,2పా

ఆదాయం :- 2, వ్యయం :- 11,

రాజపూజ్యం :- 4 అవమానం: - 7.

ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమముగా ఉంటుంది. ఆర్ధికముగా ఒడిదుడుకులు ఏర్పడ తాయి. బంధుమిత్రుల సహకారముతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారముల యందు అనుకూలముగా ఉన్నది. వృత్తి పనివారికి వ్యాపారస్తులకు సామాన్యముగా ఉంటుంది. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ధార్మిక,ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు పాల్గొంటారు.

రాజకీయ నాయకులకు శుభప్రదముగా నున్నది. వ్యవసాయదారులు సామాన్య ఫలితములను పొందుతారు. విద్యార్ధులు ఉన్నత చదువులను అభ్యసిస్తారు. కళాకారులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. దేవాలయ సందర్శనం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పురోహితులకు వాస్తు పండితులకు సంఘము నందు గౌరవ మర్యాదలు కలుగుతాయి. కంప్యూటర్ రంగము వారు అభివృద్ధి చెందుతారు.

కన్య అదృష్ట సంఖ్య 2023

కన్యారాషిని పాలించే గ్రహం బుధుడు మరియు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5 మరియు 6గా పరిగణించబడతాయి.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2023 సంవత్సరంలో మొత్తం యోగాల సంఖ్య 7.ఈ విధంగా,కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్తంగా నుండి మంచి సంవత్సరం ఉంటుందని మీరు ఆశించవొచ్చు.

కన్యరాశి ఫలాలు జ్యోతిష్య పరిహారాలు

బుధవారం రోజు ఉపవాసం వహించండి.

బుధవారం నుండి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పటించండి.

బుద్ధ దేవుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

నాణ్యమైన పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది.బుధవారం శుక్ల పక్షంలో మీరు ఈ రాత్నాన్ని చిన్న వేలుకు ధరించవొచ్చు.

మీరు కష్టకాలంలో ఉనట్టు అయితే, శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పటించడం మీకు ప్రయోజకరంగా ఉంటుంది.

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: 2023 సంవత్సరం రాశి ఫలాలు, కన్యా రాశి ఫలాలు 2023, 2023 Kanya Rasi Phalalu, Virgo Horoscope 2023, Kanya rashi 2023 Telugu, Telugu Rasi Phalalu 2023, 2023 Horscope

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS