శివ ముక్కోటి 100ఏళ్ళ తరువాత వచ్చే పుణ్యతిథి | Shiva Mukkoti Importance Telugu | Arudra darshanam

వందేళ్ల కొకసారి వచ్చే పుణ్యతిథి! ఆరుద్ర నక్షత్రం లో పున్నమి నాడు వచ్చే శివ ముక్కోటి.

ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం మాసంలో వచ్చే రోజు.

ఇవాళ అంటే జనవరి 6 న శివ ముక్కోటి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం మాసంలో వచ్చే రోజు.

శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణు మూర్తి, నారాయణుడి అనుగ్రహం కోసం వెళ్తామో.. అలానే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

జనవరి 6 ఎందుకంత ప్రత్యేకం అంటే.. వంద సంవత్సరాల క్రిందట ఏర్పడిన పుణ్యతిథి ఇది. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శివ ముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పైగా సంపదను సూచించే శుక్రవారం నాడు వచ్చింది. కాబట్టి ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన రోజు.

వంద ఏళ్ల కొకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు.. శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే.. కోటి సార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది.

ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసం మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది.

నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. జన్మరాశి బట్టి ఈశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది.

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలిగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి.

నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి.

శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అన్ని రకాల రాశుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆవు పెరుగుతో, తెల్ల జల్లేడు పూలతో అభిషేకం చేయొచ్చు.

ఎర్రటి మందార పూలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని కూడా శివుడికి సమర్పించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని భక్తిశ్రద్ధలతో కొలవాలి.

శివుడిని లింగ రూపంలో పూజించాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వచ్చే ఈరోజు న ఖచ్చితంగా శివుడికి పై పూజలు చేసి ఐశ్వర్యాన్ని పొందండి....స్వస్తీ

Tags: శివ ముక్కోటి, ఆరుద్ర నక్షత్రం, siva mukkoti, shiva, mukkoti ekadasi, shiva mukkothi arudra, shiva stotras, shiva mukkoti telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS