పృధ్వీ స్తోత్రమును పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును | Prithvi Stotram Telugu Lyrics

పృధ్వీ స్తోత్రం..

అత్యంత పుణ్యప్రదమైన పృధ్వీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు.

అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును.

అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.రైతులకు నష్టం కలుగకుండా కాపాడును.. అకాల మృత్యు దోషం తొలగును.

జయజయే జలా ధారే జలశీలే జలప్రదే l

యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ll


మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే l

మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ll


సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే l

సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ll


పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని l

పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ll

సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే l

సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ll


భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే l

భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ll


ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ l

కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ll

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

ఓ భూదేవి! నీవు యజ్ఞవరాహమునకు భార్యవు. నీవు నాకు సర్వకార్యములందు జయము కల్గునట్లు చేయుము. నీవు జయ స్వరూపిణివి అజయ స్వరూపిణివి కూడ. నీవు జయమునిచ్చుదానవు. జయశీలవు. సమస్త చరాచరసృష్టికి ఆధారభూతురాలవు.

సమస్తమునకు కారణభూతురాలవు. సర్వశక్తి సమన్వితవు. అన్ని కోరికలు తీర్చుదానవు. స్థిరముగా ఉండుదానవు. సమస్త సస్యములకు నిలయమైనదానవు. సమస్త సస్యముల నిచ్చుదానవు. సమస్త సస్యములను హరించుదానవు. సర్వ సస్య స్వరూఫిణివి.

నీవు మంగళ స్వరూపవు. మంగళ వస్తువులకు ఆధారభూతవు. మంగళములనిచ్చు నీవు మాకు మంగళములనొసగుము. ఓ భూదేవి! నీవు రాజులకు సర్వస్వమవు. రాజుల యొక్క అహంకార రూపిణివి. అట్టి నీవు మాకు భూ సమృద్ధిని కలుగజేయుము.

అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాసమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును.

ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును.

అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.

Click Here More Stotras: తెలుసు భక్తి స్తోత్రాలు

Tags: పృధ్వీ స్తోత్రము, Prithvi Stotram, Prithvi Stotram Lyrics Telugu, Prithvi Stotram Telugu, Telugu Bhakthi Stotralu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS