పతివ్రత ధర్మాలు..
భర్త మనసెరిగి అతడు ఎప్పుడేది కోరుకుంటాడో దాన్ని అతడు అడగటానికి ముందే తెచ్చిపెట్టేది. సర్వకాల సర్వావస్థలలో భర్తమేలునే కోరుకునేది. భర్తనే కాక అతడి తల్లి తండ్రుల్ని, గురువుల్ని బంధుమిత్రుల్ని గౌరవించేది.
భర్త ఆజ్ఞని ఏ మాత్రం జవదాటనిది అయిన స్త్రీ పతివ్రత. ఉత్తమ స్త్రీ తన భర్తని మనసా వాచా కర్మణా దైవంగా భావించాలి. భర్త చేసే దైవ, పితృ కార్యక్రమాల్లో అతిథి సత్కారాలలో ఎవరినీ వినియోగించకుండా తానే స్వయంగా పాల్గొనాలి.
భర్తృ చిత్తానుకూలత్వం యాసాంశీల మవిచ్యుతం |
తాసాంరత్న సువర్ణాది భార ఏవ స మండనం ॥
లోకజ్ఞానే పరాకోటిః పత్యై భక్తిశ్చ శాశ్వతీ |
శుద్ధాన్వయానాం నారీణాం విద్యాదేతత్కులం వ్రతం ॥
భర్తకి అనుకూలంగా వుండటం, మంచి శీలం అనే ఈ రెండు గుణాలు కల్గివున్న స్త్రీలకి బంగారం, రత్నాలు వంటివి కేవలం బరువులు మాత్రమే అవుతాయి కానీ అలంకారాలు కావు. ఏ కులంలో వంశంలో పుట్టిన స్త్రీకైనా లోకం, జ్ఞానం భర్తమీద అచంచలమైన భక్తి కంటే గొప్ప ధర్మాలు మరేవీ లేవు.
ఇదే కులస్త్రీ ధర్మం. కనుక ఏ స్త్రీ లోకాన్ని భర్తని సక్రమంగా ఆరాధిస్తుందో ఆ స్త్రీ మాత్రమే ధర్మార్ధకామాల్ని పొంది ఉత్తమ పతివ్రతగా విఖ్యాతి చెందుతుంది.
Famous Posts:
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
Tags: పతివ్రత ధర్మాలు, Pativrata, Pursuit of dharma, Pativrata Anusuya, Pativrata Dharmalu Telugu, Pativrata Niyamalu, Sathi Savitri,