దేవాలయ నిర్మాణము - ఆలయమును నిర్మించినచో కలిగె పుణ్యము - If the Temple is Built, it is Meritorious

Temple construction

దేవాలయ నిర్మాణము - దాని పుణ్యము

ఏ దేవుని కైనను ఆలయమును నిర్మించినచో కలిగెడి పుణ్యము ఇంతంత అని చెప్పలేము. దేవాలయ నిర్మాతలను గూర్చి యముడు తన భటులతో ఇట్లు పలికెను.

"కింకరులారా!ప్రతిమా (విగ్రహ) పూజలు చేయువారిని నరకమునకు దెచ్చు ప్రయత్నము చేయకుడు. అట్లే దేవాలయమును నిర్మించిన వారి జోలికి గూడ వెళ్ళకుడు. మంచి చెడ్డలు విచారించి ప్రవరింపుడు. జగద్రక్షకుడైన జనార్దనుని ఆశ్రయించిన వారిని జూచి మీరు దూరము నుండియే తొలగిపొండు. వారికి నరక లోక బాధలు ఉండవు కనుక మీరు వారివైపు చూడనక్కర లేదు. ఎవ్వరు గోవిందనామ స్మరణము చేయుచుందురో వారిని విడిచి దూరముగా నుండుడు. శ్రీకృష్ణు భగవానుని ధూపదీప నైవేద్యాదులతో అర్చన చేయువారి యొద్దకు వెళ్ళవలదు. ఆలయమును తుడిచి, నీళ్ళు చల్లి మ్రుగ్గులు పెట్టువారు మహాపుణ్యాత్ములు. వారి జోలికి పోవద్దు. ఆలయ నిర్మాణము చేసిన యజమానియే కాదు.

దాని నిర్మాణములో పనిచేసిన శిల్పులు కార్మికులు గూడ పుణ్యాత్ములే. మీరు వారి వైపునకు గూడ కన్నెత్తి చూడవలదు. ఇది నా యాజ్ఞ". అందుచేత ఒక దేవమందిరమును శిలలతో గాని, ఇటుకలతోగాని, కొయ్యతోగాని, కనీసము మట్టితోగాని నిర్మించినచో, సర్వపాప విముక్తుడై ప్రతిదినము యజ్ఞము చేసినంత ఫలమును బొందును. దేవాలయము నందలి యిటుకల నిర్మాణ మెన్ని సంవత్సరములు నిలిచియుండునో అన్ని వేలేండ్లు నిర్మాత స్వర్గలోకములో నుండును. విగ్రహనిర్మాత విష్ణులోకమును బొందును. ప్రతిష్ఠ చేసినవారు విష్ణు సాయుజ్యమును బొందుదురు. ఆలయము శిథిల మైనప్పుడు జీర్ణోద్ధరణము చేసినవారుగూడ ఇట్టి ఫలములనే పొందుదుర.

దగ్ధయోగములు

1. ద్వాదశీ భాను (ఆది) వారము దగ్ధయోగము.

2. ఏకాదశీ సోమవారము గూడ దగ్ధయోగము.

3. దశమీ మంగళవారము,

4. తదియా బుధవారము,

5. షష్ఠీ గురువారము,

6. విదియా శుక్రవారములు దగ్ధయోగములుగా చెప్పబడినవి.

ఈ యోగములలో ఏ పని ప్రారంభించినను అది కొనసాగదు. సప్తమీ ఆదివారమును, విదియా ఆదివారమును, ద్వాదశీ మంగళవారమును, సప్తమీ తృతీయ (తదియ)లతో గూడిన శనివారమును త్రిపుష్కరము లనబడును. ఈ దినములలో లాభము, విజయము, వృద్ధి, పుత్రజన్మము, నష్టము, భ్రష్టత్వము, నాశనము ఏది జరిగినను అది త్రిగుణముగా (మూడు రెట్లు)ఉండును.

Famous Posts:

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

Tags: దేవాలయ నిర్మాణం, ఆలయ నిర్మాణ శాస్త్రం, vastu for temple construction, temple construction permission, temple design standards, temple construction, new temple construction, temples build

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS