ఏకాక్షి నారికేళ మంత్ర ప్రయోగం - పూజా విధానం - ఉపయోగాలు | Ekakshi Narikelam Pooja Vidhanam Telugu

ఏకాక్షి నారికేళ మంత్ర ప్రయోగం:

"ఏకాక్షి నారికేళం" సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని చెప్పబడింది. ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం. సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి. ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది. వెడల్పుగా ఉన్న కన్నుని నోరు గాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు.

ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను, ఒక నోరు ఉంటుంది. ఇవి దొరకటం చాలా కష్టం. వేలాది కొబ్బరి కాయల్లో ఏ ఒక్కదాంట్లోను ఇలా రావచ్చు. మార్కెట్ లో తాటి కాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు. వీటితో పూజిస్తే ఫలితం శూన్యం. ఏకాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని, ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను, ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి.

పూజా విధానం : ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏకాక్షి నారికేళాన్ని శుభ్రమైన నీటితో గాని, గంగా జలంతో గాని కడిగి పసుపు, కుంకుమ, చందనములతో, సువాస గల పుష్పాలతో నారికేళాన్ని అలంకరించాలి. రాగి పాత్ర(చెంబు) గాని, అష్టలక్ష్మి పాత్ర గాని తీసుకొని బియ్యముతో ఆ పాత్రని నింపి, నారికేళానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టి పాత్ర పైన ప్రతిష్టించాలి. సువాసన గల అగరబత్తుల దూపాన్ని, నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించిన మట్టి దీపాలను, తియ్యటి పదార్ధం లేదా బెల్లం ముక్కలు, పండ్లు వంటివి మీ శక్తి కూడి సమర్పించి పూజ చేయాలి.

ఏకాక్షి నారికేళానికి విష్ణు సహస్రనామంతోను, లలిత సహాస్ర నామంతోను పూజ చేయాలి. ఈ పూజలో గవ్వలు, గోమతిచక్రాల కు కూడ పూజ చేయవచ్చు. ఏకాక్షి నారికేళాన్ని ఇంటి పూజా మందిరంలో గాని, షాపు పూజా మందిరంలో గాని, విధ్యా సంస్ధలలో గాని, ప్యాక్టరీలలోగాని, ఇతర వ్యాపార ప్రాంగణాల్లో గాని ప్రతిష్టించవచ్చు. ఏకాక్షి నారికేళానికి, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి తిథులు మరియు దీపావళి రోజులలో విశిష్ట పూజ చేస్తే చాలా మంచిది.

మంత్రం :  "ఓం శ్రీం హ్రీం క్లీం ఐం, మహాలక్ష్మీ స్వరూపాయ, ఏకాక్షి నారికేళాయ నమః, సర్వ సిద్ధి కురు కురు స్వాహా" ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు పఠించటం వలన ఉత్తమ ఫలితాలు లబిస్తుంది.

ఉపయోగాలు :

ఏకాక్షి నారికేళాన్ని పూజించేవారి ఇళ్లలోని కుటుంబ సభ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు. 

రోగాలు, కష్టాలు, ఆర్ధిక బాధలు దూరమవుతాయి. 

ఏకాక్షి నారికేళాన్ని శివాలయంలో గాని, సుబ్రమణ్యేశ్వర ఆలయంలో గాని దానం చేసిన కోర్టు భాదలు, రుణ భాదలు ఉండవు.

ఏకాక్షి నారికేళం పూజ చేసే వారికి వృతి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నత స్థానం కలుగుతుంది. పిల్లలలో తెలివితేటలు, చదువుపై శ్రద్ధ, పోటితత్వం పెరిగి, పోటీ పరీక్షలలో విజయం లబిస్తుంది.

ఏకాక్షి నారికేళం ఉన్నచోట శత్రు భాదలు ఉండవు. 

బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగటం వలన గర్బప్రాప్తి కలుగుతుంది.

ఏకాక్షి నారికేళం ఆయువృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి హేతువు. 

ఏ కాక్షి నారికేళం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో దుష్టశక్తుల, నరదృష్టి ప్రభావం ఉండదు.

ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి భాదలు గాని, గొడవలు గాని, అపోహలు గాని ఉండవు. కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహాకారాలు, అన్యోన్యత, అనురాగాలు, ఆప్యాయతలు కలిగి ఉంటారు.

ఏకాక్షి నారికేళం ఉన్న షాపులో గాని, ప్యాక్టరీలలో గాని, విధ్యా సంస్ధ లలో గాని, ఇతర వ్యాపార సంస్థలలో కాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ, మంచి కమ్యూనికేషన్, ధనాధాయాలు, వ్యాపారాభివృధ్ధి కలుగుతాయి.

ఏకాక్షి నారికేళం ఉన్నచోట సర్వవిదాల అభివృద్ధి, సర్వకార్యసిద్ధి, జనాకర్షణ కలుగుతాయి.

ఇంతటి మహిమాన్వితమైన ఏకాక్షి నారికేళాన్ని ప్రతిష్టించుకుని, పైన తెలిపిన ప్రకారం శాస్త్రోత్తంగా పూజలు చేస్తూ పైన తెలిపిన ఫలితాలన్నింటిని పొందండి.

Famous Posts:

Tags: ఏకాక్షి నారికేళం, Ekakshi Narikelam, Ekakshi Narikelam Telugu, Ekakshi Narikelam Pooja, Narikelam, Cocunt, Lakshmi Devi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS