విష్ణు సహస్రం ధ్యాన శ్లోకం సులువుగా చదువుకోవడానికి వీలుగా
ఇక్కడ మీకు ఇవ్వబడింది . చాలామంది ధ్యాన శ్లోకం నేర్చుకుందాం అనుకున్న వత్తులు ఎక్కువగా ఉండటం వలన పలకలేరు . వారికోసం ప్రత్యేకించి ఇలా రాయడం జరిగింది . మీరు నోట్ బుక్ లో రాసుకుని ప్రాక్టీస్ చేయండి . సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రం పెట్టుకుని 5 సార్లు వింటే మీకు సులువుగా వచ్చేస్తుంది .
క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణివిలత్ సైకతేమౌక్తికానాం
మాలాక్లుప్తా సనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్ మండితాంగః ।
శుభ్రై రభ్రైర్ దభ్రైర్ ఉపరివిరచితైర్ ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాత్ అరినలిన గదా శంఖపాణిర్ ముకుందః
భూః పాదౌ యస్య నాభిర్ వియదసురనిలశ్ చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।
అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగో భోగిగంధర్వదైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి
ఓం నమో భగవతే వాసుదేవాయ !
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్
మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాకం కౌస్తుభోద్ బాసితాంగమ్ ।
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్
నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే
సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతమ్
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే
keywords : vishnu sahasram, vishnu sahasram dhayana slokam, vishnu sahasram learning .