శత్రువుల నుండి రక్షణ పొందడానికి, శత్రు నిర్మూలనకు మరియు శత్రు బాధలు తొలగిపోవడానికి క్రింది పరిహారాలను పాటించండి - Pratyangira Tantram Telugu

ప్రత్యంగిర తంత్రం..

శత్రువుల నుండి రక్షణ పొందడానికి, శత్రు నిర్మూలనకు మరియు శత్రు బాధలు తొలగిపోవడానికి క్రింది పరిహారాలను పాటించండి.

మల్లెపువ్వులతో అమావాస్య రోజున కాళికాదేవిని ఆరాధిస్తే ఎటువంటి శతృభాధలు అయినా ప్రయోగ భాధలైనా నాశనం అవుతాయి.

మిమ్మల్ని ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడుతుంటే, నాలుగు జీడిగింజలు తీసుకొని, భైరవ లేదా ప్రత్యంగిరా మంత్రాన్ని 11సార్లు చదివి, ఊరి బయట తుమ్మచెట్టు మొదల్లో పాతిపెట్టండి. దానికి ముందు మీ శత్రువు పేరునీ 11 సార్లు ఉచ్చరించండి. శత్రు బాధలు తొలగి పోతుంది.

ఒక తెల్లని పేపరు పై మీ శత్రువు పేరు, శత్రువు యొక్క తల్లి పేరు బొగ్గు తో వ్రాసి ఊరి భయట స్మశానంలో పాతిపెట్టండి. శత్రు బాధలు తొలగి పోతుంది.

చేతిలో తెల్ల ఆవాలు తీసుకుని 11 సార్లు "ఉగ్రం వీరం మహా విష్ణుం, జ్వలంతం సర్వతో ముఖం | నృసింహం భీషణం భద్రం, మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహం ||" అన్న నృసింహ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణ లో, నలు మూలల్లో, నాలుగు దిక్కులలో చల్లడం వల్ల శత్రువు మిమ్మల్ని బాధించడు.

శత్రువు పేరు, శత్రువు యొక్క తల్లి పేరు భోజపత్రం పై గంధం తో వ్రాసి, తేనె సీసాలో పెట్టి మూత బిగించి, పూజా గదిలో పెట్టండి. శత్రువులు నిర్వీర్యులై మీకు హాని చేయకుండా వుంటారు.

శత్రువు మరీ పెట్రేగి పోతే, మీ ఇంటి బయట మంట పెట్టి, ఎండుమిరపకాయలు ఐదు తీసుకొని, మీపై నుండి 5 సార్లు శత్రువు పేరు చెబుతూ తిప్పి, ఇంటి భయట కాలుతున్న మంటలో వేసేయండి. శత్రు పీడ తొలగిపోతుంది.

కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని, "ఓం భ్రం భైరవాయ నమః" అన్న భైరవ మంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి. మీ శత్రువుల నుండి భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు.

శనివారం మిట్ట మధ్యాహ్నం తన ఎత్తుకు సరిపడా ఎత్తులో ఎర్ర దారాన్ని తీసుకుని, కొబ్బరి బోండానికి ఆ దారాన్ని చుట్టి, పసుపు కుంకుమ తో బోండాన్ని అలంకరించి, మూడు సార్లు దిష్టి తీసుకుని ప్రవహించే నదిలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అలా ఈ తంత్రాన్ని ఏడు సార్లు చేయాలి. ఆర్థిక నష్టాలు, ఋణ బాధలు తొలగిపోతాయి. శత్రు భాధల నుంచి విముక్తి లబిస్తుంది. రోగ భాధలు దరిచేరవు.

Famous Posts:

Tags: ప్రత్యంగిర తంత్రం, sri lakshmi pratyangira tantram, pratyangira tantra pdf, pratyangira tantra telugu pdf, pratyangira moola mantra, pratyangira devi mantra, pratyangira mantra telugu book, rudrayamala tantra pdf, maha havana tantram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS