కుజ‌దోషం ఉన్న‌వారు చేయాల్సిన లాల్ కితాబ్ పరిహారాలు | Lal Kitab Remedies for Kuja Dosha Telugu

వివిధ భావాలలో కుజదోషం ఉంటే లాల్ కితాబ్  పరిహారాలు

1 భావము:  వీరు అబద్ధములు ఆడకూడదు, ఏ వస్తువైనా దానం తీసుకోరాదు.

2 భావము:  వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో  చేసిన తీపి పదార్థములు తినిపించాలి.

3 భావము:  వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.

4 భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.

5 భావము:  వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే ఆనీరు పచ్చని చెట్టులో పోయాలి.వేప చెట్టును దక్షిణం వైపు నాటాలి..

6 భావము:  అంగారక మంత్రము జపించాలి, ఇనుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, తుప్పు పట్టిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.

7 భావము:  మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకోకూడదు.

8 భావము:  విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.

9 భావము:  కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునందు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.

10 భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పడనీయకండి.

11 భావము:  చిన్న మట్టి పాత్రలో తేనేకాని, సింధూరం కాని వేసి ఉంచండి 

12 భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామి ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.

ఇవి అన్ని పాటించకపోయిన కొన్ని అయిన పాటిస్తే కుజ దోషం పరిహారం అవుతుంది.

Famous Posts:

Tags: కుజ‌దోషం, లాల్ కితాబ్, kuja dosha, kuja dosha for girl, marriage, kuja dosha check, kuja dosha remedies, kuja dosha for boy, kuja dosha nakshatras, lal kitab remidies telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS