కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఏ రోజు జరుపుకోవాలి? Karthika Pournami Full Details

కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి.. దానం చేస్తే.. పూజించినంత ఫలితం లభిస్తుందని భావిస్తారు. అయితే కార్తీక పౌర్ణమి ఎప్పుడు ఏడో తారీఖా? ఎనిమిదో తారీఖా అన్నది ఇప్పుడు భక్తులలో చర్చగా మారింది.

ఎనిమిదో తారీకు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్తీక పౌర్ణమి తిధి ఉంది. అయితే పౌర్ణమి ఘడియలు చీకటి పడేవరకు లేవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం ఇదే సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పబడుతున్న, చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కొద్ది నిమిషాలు మాత్రమే, అది కూడా మధ్యాహ్న సమయంలో వస్తుందని అది కూడా మనకు కనపడదని చెబుతున్నారు. ఇక సాయంత్రం గ్రహణం విడిచి పూర్ణచంద్రుడు బయటకు వచ్చేసరికి పౌర్ణమి ఘడియలు ఉండవు కాబట్టి అప్పుడు కార్తీకపౌర్ణమి జరుపుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. సహజంగా చాలామంది ఉదయం వచ్చిన తిధిని ప్రామాణికంగా తీసుకొని, ఆ రోజంతా అదే తిధిని పరిగణిస్తారు. కానీ కార్తీక పౌర్ణమి విషయంలో ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో 8 వ తారీకు కార్తీక పౌర్ణమి, పౌర్ణమి ఘడియలు ఉండవు కాబట్టి జరుపుకో లేమని సూచిస్తున్నారు.

కార్తీక పూర్ణిమ 2022 నవంబర్ 7, సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 8న సాయంత్రం 4:31 గంటలకు ముగుస్తుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కి పూర్ణ చంద్రుడు కనిపించడమే ప్రాధాన్యత కాబట్టి, 8 వ తారీకు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉండడం లేదు కాబట్టి, ఏడవ తారీఖునే ప్రామాణికంగా తీసుకొని కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కార్తీక సోమవారం నాటి సాయంత్రం, కార్తీక పౌర్ణమిగా 365 వత్తుల దీపాలను, ఉసిరిక దీపాలను వెలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.

కార్తీక పూర్ణిమ రోజున దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఈ రోజు దానం చేయడం వల్ల 10 యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.

Famous Posts:

Tags : కార్తీక పౌర్ణమి, kartik purnima date 2022, kartik maas 2022 date, kartik maas 2022 end date, karthika pournami 2022 date and time, kartik maas 2022 start date, kartik purnima 2022 date chandra grahan, kartik purnima, kartik purnima date telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS