జీవితంలో సకల సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ! If you want to be happy and money in life

జీవితంలో సకల సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలంటే !

మనిషి జీవితం కేవలం తాత్కాలికం.అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.

మనం జీవించేటటువంటి తాత్కాలికమైన జీవితంలో సకల సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలంటే మహాభారతంలోని శాంతిపర్వం నుంచి నాలుగు మంత్రాలను పఠించడం ద్వారా సుఖశాంతులు కలుగుతాయని మహాభారతం వివరిస్తుంది.ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది.అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః” “సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”

ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సర్వే క్షయాంత నిచాయంః :

ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే.అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడిన సంపాదిస్తూ ఉంటారు.వారు ఎలాంటి పనిచేసిన చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదన లో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.

పతనంతః సమ్రుశ్ఛాయః :

ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి.ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.

సంయోగ విప్రయోగంత:

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది.అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.

లాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

మారాతంత జీవితమ్:

దీని అర్థం పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే.వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.

ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.

మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది.

Famous Posts:

Tags: life, happy, dharma sandehalu, devotional storys, bhakthi samacharam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS