గుప్త నిధులు ఎన్నిరకాలు ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాం...
గుప్త నిధులు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు.
రెండోవరకం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది.
మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశపూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు. ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను.
ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన "నిధిప్రదీపం" అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.
శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు . అవి
* కచ్చప .
* మకర .
* శంఖ .
* పద్మ .
వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు.
మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును.
నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు -
* ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .
* డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.
* కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును.
* ఒక ప్రదేశం నందు అనేక వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .
* పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడుపడిన గ్రామాల యందు నిధి ఉండును.
* ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును .
* ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును.
పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి.
భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి -
ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి ఆ కుండ కింద తప్పనిసరిగా నిధి ఉంటుందని గ్రంథాల ద్వారా తెలుస్తుంది..
Famous Posts:
Tags: గుప్త నిధులు, gupta nidhulu, hidden funds, gupta nidhulu in telugu, gupta nidhulu, gupta nidhulu telugu, how to identify gupta nidhulu