పిల్లలు కలగని వారు, సంతాన ప్రాప్తి కొరకు క్రింది పరిహారాలను పాటించండి.| Those who do not have children follow the following remedies

పిల్లలు కలగని వారు, సంతాన ప్రాప్తి కొరకు క్రింది పరిహారాలను పాటించండి.

స్త్రీలు ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి, నెలలో 21 రోజులు ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసి సంకల్పము చెప్పుకుని, "ఓం హ్రీం క్రూం క్రూర రూపిణే కేతవే ఐం సౌః స్వాహా" అన్న కేతు మంత్రం జపిస్తూ, పాలతో 108 సార్లు అభిషేకం చేసి తర్వాత శుద్ధి చేసి, బెల్లము మరియు నానబెట్టిన పెసరపప్పు నివేదన చేసి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం లేదా ఇతర సుబ్రహ్మణ్య స్వామీ వారి స్తోత్రాలు చదివి హారతి ఇవ్వాలి.

అభిషేకం చేసిన పాలను తాగి ఆ ప్రసాదం తినాలి. ఇలా నెలలో 21 రోజులు మూడు నెలలు చేయాలి. తప్పక మీ అభీష్టం నెరవేరి సంతానం కలుగుతారు.

వివాహమై ఎంతో కాలమైనా సంతానము కలగకపోతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు, కేతు, కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయించండి. పిల్లలు కలగడానికి అవరోధాలు కలిగిస్తున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి, సంతానం కలుగుతారు.

పిల్లలు కలగని దంపతులు "సంతాన గోపాల కృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతారు.

సంతానం కలగకపోవడం, పిల్లలు అనారోగ్యపాలు కావడం, చదువు రాకపోవడం, కష్టపడి చదివినా గుర్తుండకపోవడం, గ్రహ దోషాలు ఉండటం, జాతకంలో శని ఉండటం, పెళ్లి కాకపోవడం, పెళ్లి జరిగినా ఎప్పుడూ కలహాలు రావడం, పిల్లలు పుట్టక పోవడం, శత్రు పీడా ఇలాంటి వాటి అన్నిటికీ పరిష్కారం ఒకటి ఉంది. అరటి చెట్టు, తులసి చెట్టు ఈ రెండిటిని ఏదో ఒక మంచిరోజు చూసి, ఇంట్లో ఈశాన్యం మూల నాటండి. రోజు కొంచెం ఎండ తగిలేలా పెట్టి, నీళ్ళు పోయండి. రోజు వీటికి పూజ చేసి దీపం పెట్టండి. ఇలా నిత్యమూ భక్తి శ్రద్దలతో చేయడం వలన పైన తెలిపిన సమస్యలన్నీ తొలగిపోతుంది.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

santan prapti, child birth, Mantra for getting child, ayurvedic remedies for child birth, Remedies for getting a child, shiv mantra for child

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS