ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది, నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం, ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు, కాలసర్పదోషం, నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.
దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!
నవ నాగ స్తోత్రం
అనంతం వాసుకిం శేష
పద్మనాభంచ కంబలం
శంఖుపాలం ధృతరాష్ట్రంచ
తక్షకం కాళీయం తథా
ఫలశ్రుతి
ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|
|| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం ||
తైత్తిరీయ సంహితా - ౪.౨.౮
ఋగ్వేదము
నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ||
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||
నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||
|| ఇతి సర్ప సూక్తం ||
సర్ప స్తోత్రం
భుజంగేషాయ విద్మహే
క్షక్షు శివాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాత్!
ఈ మంత్రం నాగ విగ్రహానికి పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది.
Famous Posts:
> ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు
> వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి
> శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం
> యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
> గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?
> ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్
Tags : సర్ప స్తోత్రం, నాగ స్తోత్రం, naga stotram telugu, naga stotram pdf
nava naga stotram telugu pdf, naga stotram lyrics in english, naga stotram, nava nagastotram, naga stotram meaning