తిరుమల కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు…..?
కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తుల పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో అక్షరార్చన చేశారు. 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయగా, 18వ శతాబ్దానికి చెందిన తరిగొండ వెంగమాంబ మొత్తం 18 గ్రంథాలు రచించి శ్రీవారి ప్రాభవాన్ని భక్తలోకానికి అందించారు. తరిగొండ వెంగమాంబ తరిగొండలో ఐదు, తిరుమలలో 13 రచనలు చేశారు.
తరిగొండలో రచించిన గ్రంథాలు.
తరిగొండ నృసింహశతకం
నృసింహవిలాసకథ(యక్షగానం)
శివనాటకం(యక్షగానం, వీరభద్రస్వామికి అంకితం)
రాజయోగామృతసారం(ద్విపదవేదాంత కావ్యం)
బాలకృష్ణ నాటకం(యక్షగానం)
ఈ క్రింది గ్రంథాలను వెంగమాంబ తిరుమలలో రచించారు.
విష్ణుపారిజాతం(యక్షగానం)
రమాపరిణయం(అన్నమయ్య సతీమణి తిమ్మక్క రాసిన సుభద్రా కల్యాణం ప్రేరణతో రాసిన పెండ్లిపాటలు)
చెంచునాటకం(యక్షగానం)
శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి స్తోత్రం(తులసి తోటలో వెంగమాంబ ఒంటికాలిపై నిలబడి ఈ స్తోత్రం చెప్పారు)
శ్రీ రుక్మిణి నాటకం(లభ్యం కాలేదు)
గోపికా నాటకం(గొల్ల కలాపం)(యక్షగానం)
శ్రీభాగవతం(ద్విపద)
శ్రీ వేంకటాచల మహత్యం
అష్టాంగయోగసారం(పద్యకావ్యం)
జలక్రీడావిలాసం(యక్షగానం)
ముక్తికాంతావిలాసం(యక్షగానం)(వేదాంత విషయాలు)
వశిష్ట రామాయణం(ద్విపదకావ్యం)
తత్వ కీర్తనల
వెంగమాంబ రచనల్లో మిక్కిలి ప్రాచుర్యం పొందిన గ్రంథం ‘శ్రీ వేంకటాచల మహత్యం’. మహాభారతం, భాగవతం లాగా ఈ గ్రంథం ప్రసిద్ధి చెందింది. తిరుమల సందర్శనకు వచ్చిన భక్తులు వెంగమాంబ చేతులమీదుగా ఈ గ్రంథాన్ని తీసుకుని తమ తమ ప్రాంతాల్లో పురాణ ప్రవచనాలు చేసేవారు. ఈ గ్రంథం ద్వారానే ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి విస్తృత ప్రచారం జరిగిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇందులో మొత్తం ఆరు ఆశ్వాసాలున్నాయి. మొదటి మూడు ఆశ్వాసాలు వరాహస్వామివారికి సంబంధించినవి. వీటిని వరాహపురాణం నుండి స్వీకరించారు. నాలుగు, ఐదు ఆశ్వాసాలు శ్రీనివాసకల్యాణ ఘట్టానికి సంబంధించినవి. వీటిని భవిష్యోత్తర పురాణం నుండి స్వీకరించారు. ఆరో ఆశ్వాసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధినది. దీనిని వీరలక్ష్మి విలాసం నుండి స్వీకరించారు.
ఇవిగాక తరిగొండ వెంగమాంబ సందర్భోచితంగా తత్వకీర్తనలు, గేయాలు, శ్లోకాలు, పాటలు, పద్యాలు అశువుగా చెప్పారు. తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనల రూపంలో స్వామివారిని కీర్తించగా, వెంగమాంబ ద్విపద, యక్షగానం, పద్యకావ్యం, వేదాంతకావ్యం, ఆశు రచనల రూపంలో స్వామివారిని కొలిచారు. అన్నమయ్యను పూర్వకవిగా స్తుతించిన ఏకైన రచయిత్రి వెంగమాంబ కావడం విశేషం.
వెంగమాంబ కి ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టే….. కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి ఆమె పేరు పెట్టారు.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
vengamamba Annadhana Satram, వెంగమాంబ అన్నదాన సత్రము, tirumala prasadam list, tirumala, ttd, annadanam tirumala, tirumala annadanam hall