తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? Why are betel leaves used for tambulam?

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?

1. హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత 

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

2. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

3. తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

4. తమలపాకు లోని అద్భుతమైన ఆయుర్వేద గుణాలు 

తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిపుండ్లు, నోటిపూత వంటి వ్యాధులను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. అరుగుదలకు తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది కనుకనే భోజనానంతరం తాంబూల సేవనాన్ని చేస్తారు.

తమలపాకు ఎ మరియు సి విటమిన్లకు నిలయం. తమలపాకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలం లో వేసుకునే ఇతర సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని,కఫాన్నీ నిర్మూలిస్తాయి. ఏలకులు అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత,మూత్ర సంబంధ వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగుతాయి.

కాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైన ఔషధం. 

శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్న వారు తమలపాకును నుదుటిపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. చెవిపోటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెను లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయడం ద్వారా చెవిపోటు తగ్గుతుంది. చీము,పుండ్లు వంటివి నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తమలపాకు రసం రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

పూర్వకాలం లో స్త్రీలు తాంబూల సేవనం శృంగార ప్రేరేపకంగానూ, సౌందర్య వస్తువుగానూ భావించేవారు. తాంబూలం నోటినీ పెదవులనూ ఎర్రగా చేయడం ఇందుకు ప్రధానకారణం. చేతులకు గోరింటాకు లాగే నోటికి తాంబూలం శోభాకరంగా భావించేవారు. ఆ భావన ఇప్పటికీ కొంసాగుతోంది.

5. తమలపాకు వాడకం లో తప్పనిసరిగా తీసుకోవలసిన  జాగ్రత్తలు 

తమలపాకుని పూజలకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి గానీ, వాడిపోయినవి గానీ ఉపయోగించరాదు. అవి తాంబూల సేవనానికి కూడా మంచివికావు.

తమలపాకు అతిగా సేవించడం వల్ల రక్తం పలచబడే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం ఒకటి లేదా రెండుకు మించి అతిగా తినరాదు.

తమలపాకులో పొగాకు వంటివాటిని వాడటం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. సంప్రదాయ బద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తమలపాకులో హానికారకమైన వస్తువులని కలిపి సేవించడం అనారోగ్యాలకు దారితీస్తుంది.

Famous Posts:

ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా?


ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?


అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం


తమలపాకులు, తాంబూలం, betel leaf benefits, betel leaves, tambulam, tamalapakulu, pooja

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS