శనిగ్రహ వ్యాధులు
శని ప్రధానంగా కుజుడితో కలవటం వలన రోగకారకుడు అవుతాడు. దీర్ఘ కాలిక వ్యాధులను కలిగించటంలో శని ప్రధాన కారకుడు. వాత సంబంధమైన రోగాలకు శని కారకుడు. పక్షవాతం, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు, అవయవాలు సరిగా పనిచేయకపోవటం కలుగుతాయి. లివర్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్ళు , జలుబు, న్యూమోనియా,ఆస్తమా, ఈసనోఫిలియా, దగ్గు, ఊపిరితిత్తులు చెడిపోవటం, క్షయ మొదలగునవి శని కారకుడు.
శనిగ్రహం ఎముకులను సూచిస్తాడు. గజ్జి చీడుము, తామర మొదలైన అసహ్యకరమైన వ్యాధులు, ఎముకుల జాయింట్లు అరిగిపోవటం, ఎముకులు విరగటం, ఎముకల టి.బి. ఎముకుల కాన్సర్ వీటన్నంటికి శని కారకుడు. గోళ్ళు, వెంట్రుకలకు శని కారకుడు. గోళ్లు పుచ్చిపోవటం, గోళ్లు రాలిపోవటం, వెంట్రుకలు త్వరగా తెల్లబడటం, వెంట్రుకలు రాలిపోవటం ఇవన్నీ శనిగ్రహం వలన కలిగే బాధలు.
శనిగ్రహం పట్టు సడలిపోవటం, వేగంగా ముసలితనపు ఛాయలు చూపిస్తాడు. దంతాల బాధ, అజీర్ణము, పుండ్లు లేచుట, అవయవాలు ముడుచుకుపోవుట, కుంటితనం, గుడ్డితనం, నడవలేకపోవటం, శక్తి లేకపోవటం, కాళ్ళు చల్లబడటం, కోమాలోకిపోవటం, అతి నిద్ర, బద్ధకం, పనిమీద గాని ఇంకే చర్యపై గాని ఇష్టం లేకపోవటం, మత్తు పదార్ధాలు తీసుకోవటం, గంజాయి, హెరాయిన్, కొక్కెయిన్ వంటి పదార్ధాలకు బానిస అవటం, వ్యాధి నివారణను ఒక పట్టణ కానీయడు. వ్యాధి నివారణ విసుగు పుట్టేలా చేస్తాడు. ఒకవేళ వ్యాధి నివారణ కుదిరినా ఒక్కసారి జరగనీయడు.
శనిగ్రహానికి భూమిలో ఉన్న వస్తువులంటే ప్రీతి. అందువలన పుఠం పెట్టిన ఆయుర్వేదిక్ మందులు శనిగ్రహ రోగాలకు బాగా పనిచేస్తాయి. మూలికలు, భస్మాలు, నూనెలు శనిగ్రహ వ్యాధులను నివారిస్తాయి. వాతాల రోగాలు నివారణకు మసాజ్ వంటి వాటి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా చాలా ఆలస్యంగా, నెమ్మదిగా, తీరుబాటుగా వ్యాధి నయం కానీయడు.
శనిగ్రహం చంద్రుడు కలసి ఉన్న మతి భ్రమణం, ప్రతి చిన్న విషయానికి బాధపడటం, గర్భాశయ వ్యాధులను కలిగించటం, తల్లులకు పాలు లేకుండా చేయటం, శరీరం క్షీణించిపోవటం గోచారంలో ప్రసవ సమయానికి చంద్రునితో శని కలసి ఉన్న ప్రసవములో అడ్డంకులు, బిడ్డ అడ్డం తిరగటం ఇవన్నీ చేస్తాడు. స్పృహ లేకుండా చేయటం, సిగ్గులేనితనం, ఉన్మాద లక్షణాలు, బట్టలు విప్పుకొని తిరగటం, కూర్చున్న చోటనే నిద్రపోవటం, మూర్ఛ లక్షణాలు, ఫిట్సు రావటం, అవయవాలు చచ్చుబడటం, విపరీతమైన దాహం కలుగుట, ఆయాసం, దగ్గరగా ఉన్నా చోటకు కూడా నడవలేకపోవటం, శరీరంలోని ఉత్సాహామంతా చచ్చిపోవటం, కష్టపడలేకపోవటం, జీవ కణాలన్నింటిని చంపేయటం, అవయవాలు మొద్దుబారటం, స్పర్శపోవటం, రుచి పోవటం ఇలా ఎన్నో విధాలా మనుష్యులను పీడించటమే శని పని.
చంద్రునితో కలసి కన్నులో శుక్లాలు కేటారాక్ట్, రవితో కలసి కుడి కంట్లో జబ్బులు, గురువుతో కలసి లివర్ సిర్రోసిస్, లివర్ కాన్సర్, తగినంత పైత్యారసం ఉత్పత్తి కాకపోవటం, జీర్ణక్రియ దెబ్బతనటం, బుధునితో కలసి నరాలు చచ్చుబడటం, మాటలు పోవటం, నాలుక రాయిగా మారటం, బ్రెయిన్ మొద్దబారటం, చెవుడు, చెవికి రోగాలు, చంద్రుడు కూడా కలిస్తే చీముకారటం, విపరీతమైన జలుబు, శని శుక్రుల వలన ముక్కులో కండలు పెరగటం, టాన్సుల్స్ వాపు, గొంతు నొప్పులు, నోటి దుర్వాసన, పెద్ద పేగులలో రోగం, మలంలో క్రిములు, విరోచనాలు, మల దుర్వాసన, మలబద్ధకం కలగటం,పైల్స్ ఉండటం, రవితో కలసి రక్తం పాడవటం, తెల్ల, ఎర్రకణాలు తగ్గిపోవటం, కుజునితో కలసి కండరాల జబ్బు, కండరాల నొప్పులు, కేతువుతో కలసి హైబ్లడ్ ప్రెషర్, రాహుతో కలసిన విష ప్రయోగం, పిశాచ బాధలు, వైరస్ జ్వరాలు, వైరస్ వలన కలిగే అన్నిరకాల రోగాలు.
గాయాలు సెప్టిక్ అవటం, అయిన గాయాలు తొందరగా మానకపోవటం, దురదల వ్యాధి కలుగుతాయి, శని వలన జన్మాంతం నపుంసకత్వం, స్త్రీలలో సంభోగవాంఛ లేకపోవటం, శని ఈ చర్యలో ప్రవేశిస్తే దాని చంపేస్తాడు, పని చేయనీయడు. అన్నీ రకాల బ్యాక్టీరియాలు వృద్ధి పొందుతాయి. అన్నీ రకాలైన రోగాలను సృష్టించగల శక్తి కలవాడు శనిగ్రహం.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
శనిగ్రహ వ్యాధులు, shanidev, Shani pooja, shaniswaran, sani singapur, shani mantram, shaniswar pooja