స్త్రీ ధనము ఎన్ని రకములు, అవి ఏవి ?
(అ) అగ్నిదేవుడిని సప్తజిహ్వుడంటారు. అగ్నికి ఏడు నాలుకలున్నాయంటే ఏడు రకాలుగా మండుతాడని అర్థము. అవేమంటే...
(1) కాళి - నీలి మంటలు కలది.
(3) కరాలి - నీలి + నల్లని రంగులతో దట్టంగా మండునది.
(3) మనోజవము - వేగంగా వ్యాప్తి చెందే అగ్ని, ఎంత వేగమంటే మనసంత వేగంగానన్న మాట.
(4) సులోహిత - ఎర్రెర్రని మంటలు కలది.
(5) సుధామ్రవర్ణ - గోధుమరంగు మంటలు కలది.
(6) విస్ఫులింగిని - మెరుపును పోలిన మంటలు కలది.
(7) విశ్వరూపి - అత్యంత ప్రకాశవంతంగా మండు అగ్ని.
(ఆ) సప్తసంతానములు - స్వంత సంతానముతో కలిపి ఏడుమంది సంతానముల గురించి పెద్దలు తెలియచేశారు. వారెవరంటే.
(1) తన కడుపున పుట్టినవారు
(2) తటాకము (చెరువు)
(3) కావ్యము
(4) నిధానము (భూమిలో నిక్షిప్తము చేసుకొన్న ధనము)
(5) ఆలయము
(6) అడవి (వనము, తోట)
(7) భూదేవస్థాపనము - అగ్రహారము వంటి గ్రామాల నిర్మాణము
(ఇ) సముద్రధనజము - మందర పర్వతసాయంతో సముద్రమధనములో పుట్టిన సంపదలు.
(1) అమృతము (2) ఐరావతము (3) సుర (4) మహాలక్ష్మి (5) ఘృతాచి,రంభ, మేనక, చిత్రరేఖ,మేనక, మోహిని, మదన, కాంతి,చంద్రిక,కుమారి అనే అప్సరసలు. (6) అష్టనిధులు (7) ఉచ్ఛైశ్రవము (చంద్రకాంతితోనున్న తెల్లని గుర్రం (8) కనకదండము (9) కామధేనువు (10) కల్పవృక్షము (11) సూర్యకాంతమణి (12) శమంతకమణి (13) కౌస్తుభమణి (14) దేవదత్తము (15) పుష్పకవిమానము (16) నంది ఘోష (రథము)
(17) ? చెపుకోండి చూద్దాం. ఆలోచించండి. మీకు బాగా తెలుసు. తెలిసిందా ! సమాధానం ఈ మేసేజ్ చివరవుంది. స్ఫూరించకపోతేనే చూడండి. మీ చూపులో నిజాయితి వుండాలి, అంటే తెలియకపోతేనే చూడాలి.
(ఈ) స్త్రీధనము - స్త్రీకి లభించే సంపదలు .
(1) శుల్కము (కన్యాశుల్కము, ఓలి అమ్మాయిని అమ్ముకోవడం వలన లభించే స్త్రీకి లభించే ధనము)
(2) అధ్యగ్నికము ( హోమగుండము సాక్షిగా వధువుకు ఇవ్వబడిన ఆభరాణాలు మొ॥నవి
(3) అధ్యావాహనికము - సారెగా స్త్రీకి ఇచ్చే ధనము
(4) అన్వాధేయికము ( వివాహసమయంలో కన్యకు ఇచ్చే ధనము)
(5) ప్రతిదత్తము(భర్త ప్రేమగా ఇచ్చే ధనము)
(6) అతివేగనికము ( భర్త మరో వివాహం చేసుకొన్న సమయంలో మొదటి భార్యకు ప్రీతితో ఇచ్చే ధనము.
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
dharma sandesalu, devotional storys, women, money, womens money, womens types, stree