అత్యంత ప్రసిద్ధ అవతారాలలో ఒకటి, వరాహ (పంది) రూపం భూమిపై విష్ణువు యొక్క మూడవ అవతారంగా నమ్ముతారు. వరాహ జయంతి అనేది బ్రహ్మ మరియు మహేశ్ (శివుడు)తో కూడిన త్రిమూర్తులలో భూమిపై నడవడానికి అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరైన విష్ణువు జన్మదినాన్ని జరుపుకునే పండుగ. మూడు లోకాల సామరస్యాన్ని చెదిరిపోయేలా బెదిరించిన ఇద్దరు శక్తివంతమైన రాక్షసుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహంగా పునర్జన్మ పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.
కథ :
అనంత భగవానుడు ప్రళయకాలమందు జలమున మునిగిపోయిన పృధ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించాడు. ఒక రోజు స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మ దేవునితో ఇలా అన్నాడు …. “తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవము నొసగువారు, మీకు నా నమస్కారములు.
నేను మిమ్మల్ని ఏవిధంగా సేవింపవలెనో ఆజ్ఞ ఇవ్వండి.” మనువు మాటలు విన్న బ్రహ్మ, “పుత్రా! నీకు శుభమగుగాక. నిన్నుచూసి నేను ప్రసన్నుడనయ్యాను, నీవు నా ఆజ్ఞను కోరావు.
ఆత్మ సమర్పణము చేశావు. పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించాలి. నీవు ధర్మ పూర్వకముగ పృధ్విని పాలించు.
యజ్ఞములతో శ్రీ హరిని ఆరాధించు. ప్రజలను పాలించుటయే నన్ను సేవించినట్ల” అని చెప్పగా మనువు ఇలా అన్నాడు …. “పూజ్యపాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాటిస్తాను.
అయినా సర్వజీవులకు నివాసస్ధానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది. కావున నేనెట్లు భూమిని పాలింపగలను” అని అడిగాడు!
బ్రహ్మ, పృధ్విని గురించి చింతింస్తూ, దానిని ఉద్ధరించుటకు ఆలోచించసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు అకారమంత ఒక వరాహ శిశువు ఉద్భవించాడు.
చూస్తుండగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను. బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను. బ్రహ్మ స్తుతించుచుండ వరహ భగవానుడు ప్రసన్నుడయ్యెను.వరాహ భగవానుడు జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించెను.
జలమందు మునిగియున్న పృధ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానునితో తలపడెను.
సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను. జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మది దేవతలుగాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి.
ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డ్గగించి దానిపై పృధ్విని స్ధాపించెను.
పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమలకొండ. తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది.
అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే. వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు.
ఆదివరాహస్వామిగా, ప్రళయవరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా, ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము.
వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు. శ్రీనివాసుడే … శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి. వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు.
మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే … ముక్కోటి దేవతలు మురిసిపోయారట .
నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది. ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా … అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు.
అప్పుడు శ్రీనివాసుడు “నా దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనము, ప్రథమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని” చెబుతాడు. అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు.
శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి, శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు.
రెండు అవతాలతో, రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది.
రెండుసార్లు వరాహరూపం దాల్చడం వల్లనే వరాహ జయంతిని ఎప్పుడు జరపాలనే సందిగ్ధం ఏర్పడింది.
సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్టం చేయడానికి ఎత్తిన యజ్ఞవరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశి రోజు , వరాహస్వామి హిరణ్యాక్షుడి బారినుండి భూమిని రక్షించడానికి ఏర్పడిన వరాహరూప జయంతి బాద్రపద శుక్ల తృతీయ అని గ్రంథాల ఆధారంగా వెల్లడవుతుంది.
వరాహ జయంతి లేదా వరాహ ద్వాదశి , వరాహం అంటే పంది. శ్రీమహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించాడు.
అలాంటి అవతారాలలో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవింశతి అవతారాలు అని పిలుస్తారు. వాటిలో అతి ముఖ్యమైనవి దశావతారాలు.
ఆ దశావతారాలలో మూడవ అవతారమే వరాహ అవతారం. ఆదివరహ మూర్తి , యజ్ఞవరాహ మూర్తి , మహా సూకరం , వరాహస్వామి వంటి పేర్లతో పిలువబడుతున్నాడు.
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళలోకంలో దాక్కున్నాడు. హిరణ్యాక్షుడి బారినుండి భూమిని కాపాడమని దేవతలు , భూదేవి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు.
వారి ప్రార్థనలు మన్నించి శ్రీమహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహావతారం ఎత్తాడు.
పాతాళ లోకానికి చేరుకోవడానికి వరాహావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడిని సంహరించి చుట్టగా ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్టించాడు.
పూర్వం ఒకరోజు స్వాయంభువ మనువు వినయంగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు … ‘తండ్రీ ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు , జీవం పోశారు , మీకు నా నమస్కారాలు , నేను మిమ్మల్ని ఏ విధంగా సేవించాలో ఆజ్ఞ ఇవ్వండి’ అని వేడుకున్నాడు.
మనువు మాటలు విన్న బ్రహ్మ ‘పుత్రా ! నీకు శుభం కలుగుగాక. నిన్ను చూసి నేను ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు నా ఆజ్ఞను కోరుకున్నావు. ఆత్మసమర్పణ చేశావు.
పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరంతో పాలించాలి. నీవు ధర్మపూర్వకంగా పృథ్విని పాలించు. యజ్ఞాలతో శ్రీహరిని ఆరాధించు. ప్రజలను పాలించడమే నన్ను సేవించినట్లు అవుతుంది’ అని బదులిచ్చాడు.
మళ్ళీ మనువు ‘పూజ్యపాదా ! మీ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. అయినా సర్వజీవాలకు నివాసస్థానం అయిన భూమి ప్రళయజలంలో మునిగి వుంది.
కాబట్టి నేను ఎలా భూమిని పరిపాలించగలను ?’ అని అడిగాడు. దానికి బ్రహ్మ , పృథ్విని గురించి చింతిస్తూ , భూమిని ఉద్దరించడానికి ఆలోచించసాగాడు.
అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు ఆకారం అంత ఒక వరాహ శిశువు బయటికి వచ్చాడు. చూస్తుండగానే అది పర్వతాకారం దాల్చి గర్జించసాగింది.
బ్రహ్మదేవుడు భగవంతుడి ఘరఘరలు విని స్తుతించడం ప్రారంభించాడు. బ్రహ్మ స్తుతించడంతో వరాహస్వామి ప్రసన్నుడయ్యాడు.
తరువాత వరాహస్వామి జగత్కళ్యాణం కోసం సముద్రంలోకి ప్రవేశించి , జలంలో మునిగి ఉన్న పృథ్విని తన కోరలపై తీసుకుని రసాతలం నుండి పైకి వస్తుండగా పరాక్రవంతుడైన హిరణ్యాక్షుడు జలంలోనే గదతో వరాహస్వామితో తలపడ్డాడు.
సింహము , ఏనుగును వధించినట్లు వరాహస్వామి క్రోధంతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. జలం నుండి బయటకు వస్తున్న వరాహస్వామిని బ్రహ్మాది దేవతలు చూసి చేతులు జోడించి స్తుతించసాగారు.
ప్రసన్నుడైన వరాహస్వామి తన గిట్టలతో జలాన్ని అడ్డగించి దానిపై పృథ్విని స్థాపించాడు. హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత వరాహస్వామి భూమిమీద తిరిగిన ప్రదేశమే నేటి తిరుమల కొండ.
తిరుమల కొండ మొదట వరాహక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. తిరుమల కొండపై ఉండడానికి కొంత స్థలం ప్రసాదించమని వేంకటేశ్వరస్వామి వరాహస్వామిని అడగగా అప్పుడు వరాహస్వామి తనకు మూల్యం చెల్లిస్తే తప్పకుండా స్థలం ఇస్తానని అన్నాడు.
అప్పుడు శ్రీనివాసుడు ‘నా దగ్గర ధనం లేదు అందుకు ప్రతిగా మీరు ఇచ్చే స్థలానికి నా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా మీ దర్శనం చేసుకుని , ప్రథమ నైవేద్యం మీకు చెందేట్లుగా చూస్తాను’ అని బదులిచ్చాడు.
దానికి అంగీకరించిన వరాహస్వామి వేంకటేశ్వరుడికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలలో తెలుపబడింది. తిరుమల కొండపై వేంకటేశ్వరుడికి ఉండడానికి అనుమతి ఇచ్చిన వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు. ఆదివరాహస్వామి , ప్రళయవరాహస్వామి , యజ్ఞవరాహస్వామి.
తిరుమలలో ఆదివరాహస్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు శ్రీమహావిష్ణువు. అందుకే తిరుమల క్షేత్రంలో రెండు అవతారాలతో , రెండు మూర్తులతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు , భక్తుల కోరికలు తీరుస్తున్నారు. శ్రీమహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శ్రీమహావిష్ణువు మరొక సందర్భంలో కూడా వరాహరూపం దాల్చాడు. అది అవతారం కాదు రూపం. కల్పాంతం ముగిసిన తరువాత కొత్త జగతికి ప్రారంభ సమయంలో జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు పూర్ధ్వ భాగాలుగా , ఏడు అధో భాగాలుగా విభజించి ఆయా లోకాలలో అవసరమైన వనరులను సమకూరుస్తున్నాడు శ్రీ మహావిష్ణువు.
అందులో భాగంగా భూమిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో అనేక పర్వతాలు , సముద్రాలు , నదులు సమకూర్చిన తరువాత ఆ భారాన్ని తాళలేక భూమి కుంగిపోసాగింది.
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు మరొకసారి వరాహరూపం ధరించి తన కోరల మీద భూమిని ఉంచుకున్నాడు. ఆ స్థితిలో భూమిని స్థిరంగా నిలపడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి , వాటి తొండాలమీద భూమిని ప్రతిష్టించాడు.
అప్పటినుండి ఆ అష్టదిగ్గజాలే భూమిని కాపాడుతూ ఉన్నాయని పురాణ కథనం. అలా అవతరించిన వరాహరూపాన్ని యజ్ఞ వరాహరూపం అని అంటారు.
తిరుమలలో వరాహ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
Famous Posts:
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
varaha jayanti, varaha avatar, varaha jayanti telugu, varaha avataram, sri maha vishnuvu