కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...!!
పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెస్తాం. తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. అంతా బాగానే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటొ కాస్త తెలుసుకుందాం.
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....
Also Read : కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?
1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.
2. కాయ కొట్టేటప్పుడు 9అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది.
3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది.
4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు.
5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.... లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.
Famous Posts:
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
breaking coconut in temple, temple, coconut, temple coconut breaking rules, hindu coconut breaking ritual,