కుంకుమ వల్ల ఇన్ని సమస్యలు తొలగిపోతాయా..?
సాధారణంగా కుంకుమ హిందూ సాంప్రదాయాలలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా నిత్యపూజలు కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
అదేవిధంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహమైన స్త్రీ తప్పకుండా నుదుటిపై సిందూరం పెట్టుకొని ఉంటుంది.పెళ్ళైన మహిళ నుదుటిపై సిందూరం పెట్టుకోవడం వల్ల తన భర్త ఆయుష్షు క్రమంగా పెరుగుతుందని భావిస్తుంది. కనుక పెళ్లైన మహిళలు సింధూరం దిద్దుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
Also Read : వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలివే..!!
సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకోసమే ఈ కుంకుమతో వినాయకుడి నుంచి హనుమంతుడు వరకు పూజలు నిర్వహిస్తుంటారు. కుంకుమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. కుంకుమ మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.
మన ఇంట్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఆంజనేయస్వామికి సింధూరంలో జాస్మిన్ ఆయిల్ వేసి ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాలు పూజించటం వల్ల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
Also Read : సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి.
మన ఇంట్లో ఏ వ్యక్తికైనా అనారోగ్యం చేస్తే ఎన్నో మందులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు.ఇలాంటి సమయంలో కొద్దిగా సింధూరం కలిపిన నీటిని ఆ వ్యక్తిపై చల్లడం వల్ల వ్యాధి నుంచి కోలుకుంటారని పండితులు చెబుతున్నారు.
మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల కుటుంబంలో కలహాలు, ఆందోళనలు ఏర్పడుతుంటాయి. ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను మన ఇంటి నుంచి పారద్రోలాలంటే మన ఇంటి ద్వారం పై కుంకుమలో కొద్దిగా నూనెను కలిపి పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది. ఈ విధంగా 40 రోజుల పాటు చేయడం వల్ల మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
Famous Posts:
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
కుంకుమ, Kumkuma, Significance of Kumkum, kumkum powder benefits, kumkum use telugu